Baal Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డును "బాల్ ఆధార్ కార్డ్" (బాలల ఆధార్‌ కార్డు) అని కూడా పిలుస్తారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన ఆధార్ కార్డుకు ప్రత్యేక వెర్షన్ ఇది. ఇది సాధారణ కార్డులా కాకుండా నీలం రంగుతో విభిన్నంగా ఉంటుంది. బాల్ ఆధార్ కార్డు ఆ చిన్నారికి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లుతుంది. ఆ తర్వాత, ఏదైనా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.


బయోమెట్రిక్ డేటా అవసరం లేకుండానే బ్లూ ఆధార్ కార్డ్ జారీ
సాధారణంగా, ఆధార్‌ కార్డులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, వేలిముద్రలు (Biometric), కనుపాపలు (Iris), చిరునామా వంటి వివరాలు ఉంటాయి. బ్లూ ఆధార్ కార్డ్ ఇందుకు కాస్త భిన్నంగా ఉంటుంది. బ్లూ ఆధార్‌ కార్డ్‌ జారీకి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా, తల్లిదండ్రుల UIDకి లింక్ చేసిన ఫోటోను ఉపయోగించి కార్డు జారీ చేస్తారు.


దరఖాస్తుకు అర్హత (Eligibility For Blue Aadhaar Card)
జనన ధృవపత్రం (Birth Certificate) లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ అందించడం ద్వారా తల్లిదండ్రులు తమ నవజాత శిశువుల కోసం బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లలు కొంచం పెద్దవాళ్లు అయితే, వీటితో పాటు పాఠశాల IDని కూడా అప్లికేషన్‌తో కలిపి సబ్మిట్‌ చేయొచ్చు.


బ్లూ ఆధార్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? (Importance Of Blue Aadhaar Card)
వివిధ ప్రభుత్వ సహాయ కార్యక్రమాల నుంచి లబ్ధి పొందడానికి బ్లూ ఆధార్‌ కార్డ్‌ అవసరం. ముఖ్యంగా, ఆర్థికంగా బలహీనమైన వర్గానికి (EWS) చెందినవాళ్లు స్కాలర్‌షిప్‌లు పొందేందుకు బ్లూ ఆధార్ కార్డ్ ఉండాలి. పాఠశాలల్లో అడ్మిషన్ కోసం బ్లూ ఆధార్‌ కాపీని ఇవ్వాలి.


బ్లూ ఆధార్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? (How To Apply For Blue Aadhaar Card?)


-- అధికారిక ఉడాయ్‌ (UIDAI)వెబ్‌సైట్‌ని సందర్శించి, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ ఎంచుకోండి.


-- పిల్లల పేరు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోన్ నంబర్‌ నమోదు చేయండి.


-- ఇప్పుడు, రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్‌మెంట్ స్లాట్‌ను ఎంచుకుని, మీ సమీపంలోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.


-- మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పిల్లల జనన ధృవీకరణ పత్రం సహా అవసరమైన పత్రాలు ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లండి.


-- మీ వెళ్లిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది.               


-- ధృవీకరణ విజయవంతమైన 60 రోజులలోపు మీ పిల్లల పేరు మీద బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది.        


మీకు మరింత సమాచారం కావాలాన్నా, లేదా ఏవైనా సందేహాలు ఉన్నా అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మీ దగ్గరలోని ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించండి.


మరో ఆసక్తికర కథనం: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?