Bank Holiday List For November 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్‌ 2024 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆ లిస్ట్‌ ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈ నెలలో 12 రోజులు మూతబడతాయి. దీపావళి, లక్ష్మీపూజ, ఛత్‌ పూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి వంటి పండుగలు, కన్నడ రాజ్యోత్సవం వంటి ప్రాంతీయ విశేషాలు, వారాంతాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రాంతీయ పండుగలు, కార్యక్రమాలను బట్టి ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.


తేదీ & రాష్ట్రం వారీగా నవంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా


నవంబర్ 01, 2024 (శుక్రవారం): దీపావళి, కుత్, కన్నడ రాజ్యోత్సవం కారణంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు పని చేయవు.


నవంబర్ 02, 2024 (శనివారం): దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజల కారణంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలలో బ్యాంకులు సెలవు తీసుకుంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంక్‌లు పని చేస్తాయి.


నవంబర్ 03, 2024 (ఆదివారం): వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.


నవంబర్ 07, 2024 (గురువారం): ఛత్ పూజ కోసం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో బ్యాంకులను క్లోజ్‌ చేస్తారు.


నవంబర్ 08, 2024 (శుక్రవారం): ఛత్ పూజ, వంగల పండుగ కారణంగా బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు పని చేయవు.


నవంబర్ 09, 2024 (శనివారం): రెండో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంక్‌లను మూసేస్తారు.


నవంబర్ 10, 2024 (ఆదివారం): దేశవ్యాప్తంగా సన్‌ డే హాలిడే.


నవంబర్ 15, 2024 (శుక్రవారం): గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పూర్ణిమ సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్‌, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.


నవంబర్ 17, 2024 (ఆదివారం): దేశవ్యాప్తంగా ఆదివారం సెలవు.


నవంబర్ 18, 2024 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు మూతపడతాయి.


నవంబర్ 23, 2024 (శనివారం): సెంగ్ కుత్స్నెమ్ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులు పని చేయవు. నాలుగో శనివారం కాబట్టి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ బ్యాంక్‌లు సెలవులో ఉంటాయి.


నవంబర్ 24, 2024 (ఆదివారం): ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌ గేట్లు తెరుచుకోవు.


బ్యాంక్‌ సెలవులను ఎలా వర్గీకరిస్తారు?


బ్యాంక్‌ సెలవులను రిజర్వ్ బ్యాంక్‌ మూడు రకాలుగా వర్గీకరించింది. 


రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) హాలిడే: పబ్లిక్ హాలిడేస్‌ సహా ఇతర బ్యాంక్ సెలవుల్లో కూడా RTGS ద్వారా నగదు బదిలీలు ఏడాది పొడవునా 24/7 అందుబాటులో ఉంటాయి. అంటే కస్టమర్‌లు బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లక్కర్లేకుండానే తక్షణమే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.


బ్యాంకుల ఖాతాల ముగింపు సెలవు: ఆదివారాలు, రెండు & నాలుగో శనివారాలు, ముందస్తుగా ప్రకటించిన ఇతర సెలవు రోజులు ఈ అకౌంట్‌ కిందకు వస్తాయి.


నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవులు: ఈ పద్దు కింద ఇచ్చే సెలవులు పూర్తిగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ కార్డ్‌ పాయింట్ల దగ్గర్నుంచి రైలు టిక్కెట్‌ బుకింగ్‌ వరకు - ఈ రోజు నుంచి న్యూ రూల్స్‌