By: ABP Desam | Updated at : 14 Aug 2023 03:12 PM (IST)
ఇంటి లోన్, కార్ లోన్ చాలా చవక
Home Loan Interest Rate Reduced: రెపో రేటును మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నాక, దేశంలోని కొన్ని కమర్షియల్ బ్యాంక్‌లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించాయి, కస్టమర్లకు రావల్సిన ప్రయోజనానికి కోత పెట్టాయి. వీటికి భిన్నంగా, ఒక గర్నమెంట్ బ్యాంక్ తన లోన్ వడ్డీ రేటును తగ్గించింది. గృహ రుణం (home loan), కార్ లోన్ (car loan) మీద వసూలు చేసే ఇంట్రెస్ట్ రేట్లను కుదించింది. దీంతోపాటు, లోన్ ప్రాసెసింగ్ ఫీజునూ కూడా తగ్గించింది. తద్వారా తన కస్టమర్లకు అందే బెనిఫిట్స్ పెంచింది.
కస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిర్ణయం తీసుకున్న ఆ లెండర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra). వడ్డీ రేటు తగ్గింపుపై శనివారం రోజున ఒక ప్రకటన చేసింది.
తాను ఇచ్చే గృహ రుణం, కారు రుణాలపై 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) వరకు వడ్డీ రేట్లను ఈ ప్రభుత్వ బ్యాంక్ తగ్గించింది. డిడక్షన్ తర్వాత, ఇప్పుడు, గృహ రుణం 8.60 శాతం నుంచి 8.50 శాతం వడ్డీకి అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, కారు లోన్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.70 శాతానికి చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రేట్లు ఇవాళ్టి (సోమవారం, ఆగస్టు 14, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి.
కస్టమర్లకు ఎక్కువ బెనిఫిట్
రుణాలు తీసుకునే ఖాతాదార్లకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయడంతో పాటు తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటామని ప్రభుత్వ బ్యాంకు వెల్లడించింది. వడ్డీ రేటు తగ్గడం వల్ల, లోన్ రిసీవర్ (రుణగ్రహీత) మీద అప్పు భారం తక్కువగా ఉంటుంది. చెల్లించాల్సిన EMI మొత్తం తగ్గుతుంది. కొత్తగా రుణం తీసుకునే వాళ్లకే కాదు, ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోన్ తీసుకున్న వాళ్లకు కూడా ఈ బెనిఫిట్ వర్తిస్తుంది, వాళ్ల EMI అమౌంట్ తగ్గుతుంది.
ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసిన బ్యాంక్
లోన్ మీద ఇంట్రస్ట్ రేట్లను తగ్గించడం మాత్రమే కాదు, కొన్ని రకాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఉడాన్ ప్రచారంలో భాగంగా... విద్యా రుణం (education loan), బంగారం రుణం (gold loan) వంటి ఇతర రిటైల్ స్కీమ్స్ మీద ప్రాసెసింగ్ ఫీజ్ మొత్తాన్ని మాఫీ చేసింది. ఈ రోజు నుంచి ఎవరైనా ఈ బ్యాంకు నుంచి విద్య, బంగారం వంటి రుణాలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఆర్బీఐ కీలక నిర్ణయం
ఈ నెల 8-10 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రిజర్వ్ బ్యాంక్ MPC యొక్క మూడో సమావేశం ఇది. ఈ మూడో మీటింగ్‌లో కూడా రెపో రేట్‌ను కేంద్ర బ్యాంక్ పెంచలేదు, 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన MPC సమావేశంలోనూ ఇదే రెపో రేటు కంటిన్యూ అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2022-23) రెపో రేట్ ఆరు సార్లు పెరిగింది, 4.50 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. ఆ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును కంటిన్యూగా పెరగడం వల్ల, బ్యాంక్‌లు ఇచ్చే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణ వ్యయాల భారం పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ ఆదాయం ఇచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఆగస్టు 15 వరకే లక్కీ ఛాన్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Credit Card: సిబిల్ స్కోర్‌లో మీరు 'పూర్' అయినా క్రెడిట్ కార్డ్ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి
Sweep Account: స్వీప్-ఇన్ గురించి తెలుసా?, సేవింగ్స్ అకౌంట్ మీద FD వడ్డీ తీసుకోవచ్చు
YES Bank FD Rates: యెస్ బ్యాంక్ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు
Latest Gold-Silver Price 04 October 2023: ఏడు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Price 04 October 2023: మరింత తగ్గిన పసిడి కాంతి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
Gayatri Joshi: కార్ల పరేడ్‌లో ప్రమాదం, బాలీవుడ్ నటికి తీవ్ర గాయాలు - ఇద్దరి మృతితో విషాదం
/body>