By: ABP Desam | Updated at : 31 May 2023 09:49 AM (IST)
₹50 లక్షల లోన్ మీద ₹12 లక్షలు మిగుల్చుకోవచ్చు
Home Loan Calculation: ఇల్లు కట్టుకోవాలన్నా, కొనాలన్నా, రీమోడల్ చేయాలన్నా అవసరమైన డబ్బులు హోమ్ లోన్ రూపంలో అందుతాయి. దేశంలోని ప్రతి బ్యాంకు గృహ రుణం ఇస్తోంది, దానిపై వడ్డీని వసూలు చేస్తుంది. ఇచ్చిన అప్పును నెలవారీ వాయిదాల రూపంలో (EMI) తిరిగి వసూలు చేస్తుంది. సాధారణంగా, ఇంటి లోన్‌ను 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాల వ్యవధితో తీసుకుంటుంటారు. మరికొందరు, రుణ మొత్తాన్ని బట్టి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దీర్ఘకాలానికి కూడా తీసుకుంటారు. ఇది, కస్టమర్ అర్హత, వయస్సు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
లోన్ టెన్యూర్ ఎంత ఎక్కువ ఉంటే, హౌసింగ్ లోన్ మీద చెల్లించాల్సిన వడ్డీ మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. మీ లోన్‌ను త్వరగా చెల్లించడానికి మీరు ఎప్పటికప్పుడు ముందస్తు చెల్లింపులు (prepayments) చేయాలన్నది మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ల సిఫార్సు. దీనివల్ల, మీ లోన్ మొత్తం త్వరగా కరిగిపోవడంతో పాటు, చెల్లించాల్సిన కాల వ్యవధి కూడా తగ్గుతుంది. ఫలితంగా మీకు చాలా డబ్బు మిగులుతుంది.
ప్రతి రోజూ రూ. 100 ఆదా చేయడం వల్ల మీరు రూ. 50 లక్షల హోమ్ లోన్ మీద రూ. 12 లక్షలు సేవ్ చేయవచ్చు. మీరు నమ్మలేకపోయినా, ఇది నిజమేనని ఈ సింపుల్ కాలుక్యులేషన్‌తో మీకు అర్ధం అవుతుంది.
హౌస్ లోన్ ప్రి-పెయిడ్ ఆప్షన్లు
bankbazaar.com సమాచారం ప్రకారం... ఒకవేళ మీరు 20 ఏళ్ల కాల వ్యవధితో గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే, ప్రతి సంవత్సరం లోన్ మొత్తంలో 5% మొత్తాన్ని ముందస్తుగా చెల్లిస్తే, మీ 20 సంవత్సరాల లోన్ టెన్యూర్ 12 సంవత్సరాలకు తగ్గుతుంది. అంటే, 20 ఏళ్లలో తీరాల్సిన అప్పు 12 సంవత్సరాల్లోనే పూర్తిగా తీరిపోతుంది. ఇలా ఏకమొత్తంలో ప్రీ-పేమెంట్ చేయలేకపోయినా, మీరు చెల్లించే EMI మొత్తాన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళితే, 20 సంవత్సరాల టెన్యూర్ 17 సంవత్సరాలకు తగ్గుతుంది. కస్టమర్లు తమ హోమ్ లోన్ EMIని ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుకునే అవకాశం ఉంది. మీరు ఈ ఆప్షన్ తీసుకుంటే, పెద్దగా బర్డెన్ లేకుండా, 13 సంవత్సరాల్లోనే 20 సంవత్సరాల రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
12 లక్షల రూపాయలు ఎలా ఆదా చేయాలి?
మీరు ప్రతి రోజూ, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా, రూ. 100 ఆదా చేస్తూ వెళితే సంవత్సరం చివరిలో (365 రోజులు x రోజుకు ₹100) ఆ మొత్తం రూ. 36,500 అవుతుంది. ఈ డబ్బును హౌస్ లోన్ ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగించవచ్చు.
ఫిస్‌డమ్ (Fisdom) వెబ్‌సైట్‌లోని లెక్కల ప్రకారం... రోజుకు రూ. 100 ఆదా చేయడం వల్ల, 9.5 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాల వ్యవధికి తీసుకున్న రూ. 50 లక్షల రుణం మీద రూ. 12 లక్షలు ఆదా చేసుకోవచ్చు. 9.5 శాతం వడ్డీ రేటుతో 25 ఏళ్ల కాల వ్యవధికి రూ. 50 లక్షల రుణం తీసుకుంటే, రోజుకు రూ. 100 ఆదా చేయడం వల్ల మొత్తంగా రూ. 20 లక్షలు సేవ్ చేయవచ్చు.
స్పష్టీకరణ: గృహ రుణాలు వంటి వివిధ లోన్‌లపై వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. లోన్ కోసం ఫలానా లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి అని 'abp దేశం' మీకు ఎప్పుడూ సలహా ఇవ్వదు. దీని కోసం మీరు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవచ్చు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: మీ డబ్బుల్ని వేగంగా డబుల్ చేసే మంచి పోస్టాఫీసు స్కీమ్
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్