search
×

GST Hike on Daily Essentials: సోమవారం నుంచి పెరగనున్న వంటింటి ఖర్చు! పెరుగు, బియ్యంపై పన్ను రేట్ల పెంపు!!

GST Tax Rates: పన్నుల వల్ల సామాన్యుడి వంటింటి ఖర్చు మరికొంత పెరగనుంది. ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీర్‌, ముందుగానే ప్యాక్‌ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై 5 శాతం జీఎస్‌టీ వడ్డించారు.

FOLLOW US: 
Share:

GST Tax Rates Increased Check List of Items Which Get Costlier from July 18, 2022: పక్షం రోజుల క్రితం చండీగఢ్‌లో జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. పన్ను రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల కమిటీ చర్చించింది. కొన్ని వస్తువులపై పన్ను పెంచగా మరికొన్నింటిపై తగ్గించింది. ఇందులో సామాన్యుడిపై భారం పెరిగే ఉత్పత్తులూ ఉండటం కలవర పెడుతోంది. జులై 18 నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి. 

పన్నుల వల్ల సామాన్యుడి వంటింటి ఖర్చు మరికొంత పెరగనుంది. ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, పన్నీర్‌, ముందుగానే ప్యాక్‌ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై 5 శాతం జీఎస్‌టీ వడ్డించారు. ఫలితంగా నిత్యావసర సరకుల ధరలు పెరగనున్నాయి.

ఏయే ధరలు పెరుగుతాయంటే

ప్యాకేజ్‌ చేసిన ఆహారం: ముందుగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న మంత్రుల కమిటీ ప్రతిపాదనను జీఎస్‌టీ మండలి ఆమోదించింది. ఇప్పటి వరకు బ్రాండెడ్‌ కాని ఆహార పదార్థాలపై పన్ను ఉండేది కాదు. అందులోంచి ప్రీ ప్యాకేజ్‌డ్‌, ప్రీ లేబుల్డ్‌ రిటైల్‌ ప్యాకెట్లను ఇందులోంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లేబుల్‌, ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీ, బటర్‌ మిల్క్‌పై పన్ను వేస్తారు.

బ్యాంకు చెక్‌ బుక్కులు: వినియోగదారులకు కొద్దిగా రుసుము తీసుకొని బ్యాంకులు చెక్‌ బుక్కులు మంజూరు చేస్తాయి. ఆ రుసుముపై ఇక నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించనున్నారు.

హోటల్‌ గదులు: రోజుకు వెయ్యి రూపాయిలు వసూలు చేసే హోటల్‌ గదులను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు పరిధిలో ఉంది.

హాస్పిటల్‌ పడకలు: ఆస్పత్రుల్లో ఒక పడకకు రోజుకు రూ.5000కు మించి బిల్లు వేస్తే దానిపై ఐటీసీతో సంబంధం లేకుండా 5 శాతం పన్ను వేస్తారు. ఐసీయూ పడకలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఎల్‌ఈడీ బుగ్గలు: త్వరలో ఎల్‌ఈడీ బుగ్గలు, ఫిక్చర్లు, ఎల్‌ఈడీ దీపాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్నును 18 శాతానికి పెంచారు.

కత్తులు: కట్టింగ్‌ బ్లేడ్స్‌, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కే షార్ప్‌నర్లు, బ్లేడులు, చెంచాలు, ఫోర్కులు, లాడ్లీలు, స్కిమ్మర్లు, కేక్‌ సర్వ్‌ చేసే పాత్రలను 12 శాతం నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.

పంపులు, యంత్రాలు: నీటి పంపులు, సెంట్రీఫ్యూజల్‌ పంపులు, బావుల్లో వాడే టర్బైన్‌ పంపులు, సబ్‌మెర్సిబుల్‌ పంపులు, సైకిల్‌ పంపులను 12 నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. శుభ్రం చేసే యంత్రాలు, గార్డెనింగ్‌ యంత్రాలు, విత్తనాలు నాటే యంత్రాలు, వాయు ఆధారిత పిండి చక్కీ, వెట్‌ గ్రైండర్లపై 12 కాకుండా 18 శాతం పన్ను విధిస్తారు.

Published at : 16 Jul 2022 01:16 PM (IST) Tags: GST Curd Rice Price hike GST Tax Rate butter milk

ఇవి కూడా చూడండి

Gold Investment: స్టాక్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు

Gold Investment: స్టాక్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు

Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ పొందొచ్చు

Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ పొందొచ్చు

LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్‌ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!

LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్‌ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!

Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!

Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!

టాప్ స్టోరీస్

Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు

Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్

Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్