By: ABP Desam | Updated at : 29 Jun 2022 06:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
జీఎస్టీ ( Image Source : PTI )
GST Tax Rates Increased Check List of Items Which Get Costlier: చండీగఢ్ వేదికగా రెండురోజుల పాటు జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను రేటు హేతుబద్ధీకరణ దిశగా మంత్రుల కమిటీ ముందుకు సాగింది. కొన్ని వస్తువులపై జీఎస్‌టీని పెంచగా మరికొన్నింటిపై మినహాయింపులు ప్రకటించారు. ముందుగా ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాలపై పన్ను వేశారు. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు సహా ప్యాకేజ్ చేయని ఉత్పత్తులనూ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఏయే ధరలు పెరుగుతాయంటే
ప్యాకేజ్ చేసిన ఆహారం: ముందుగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న మంత్రుల కమిటీ ప్రతిపాదనను జీఎస్‌టీ మండలి ఆమోదించింది. ఇప్పటి వరకు బ్రాండెడ్ కాని ఆహార పదార్థాలపై పన్ను ఉండేది కాదు. అందులోంచి ప్రీ ప్యాకేజ్‌డ్, ప్రీ లేబుల్డ్ రిటైల్ ప్యాకెట్లను ఇందులోంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లేబుల్, ప్యాక్ చేసిన పెరుగు, లస్సీ, బటర్ మిల్క్‌పై పన్ను వేస్తారు.
బ్యాంకు చెక్ బుక్కులు: వినియోగదారులకు కొద్దిగా రుసుము తీసుకొని బ్యాంకులు చెక్ బుక్కులు మంజూరు చేస్తాయి. ఆ రుసుముపై ఇక నుంచి 18 శాతం జీఎస్‌టీ విధించనున్నారు.
హోటల్ గదులు: రోజుకు వెయ్యి రూపాయిలు వసూలు చేసే హోటల్ గదులను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు పరిధిలో ఉంది.
హాస్పిటల్ పడకలు: ఆస్పత్రుల్లో ఒక పడకకు రోజుకు రూ.5000కు మించి బిల్లు వేస్తే దానిపై ఐటీసీతో సంబంధం లేకుండా 5 శాతం పన్ను వేస్తారు. ఐసీయూ పడకలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
ఎల్‌ఈడీ బుగ్గలు: త్వరలో ఎల్‌ఈడీ బుగ్గలు, ఫిక్చర్లు, ఎల్‌ఈడీ దీపాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్నును 18 శాతానికి పెంచారు.
కత్తులు: కట్టింగ్ బ్లేడ్స్, పేపర్ కత్తులు, పెన్సిల్ చెక్కే షార్ప్‌నర్లు, బ్లేడులు, చెంచాలు, ఫోర్కులు, లాడ్లీలు, స్కిమ్మర్లు, కేక్ సర్వ్ చేసే పాత్రలను 12 శాతం నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.
పంపులు, యంత్రాలు: నీటి పంపులు, సెంట్రీఫ్యూజల్ పంపులు, బావుల్లో వాడే టర్బైన్ పంపులు, సబ్‌మెర్సిబుల్ పంపులు, సైకిల్ పంపులను 12 నుంచి 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. శుభ్రం చేసే యంత్రాలు, గార్డెనింగ్ యంత్రాలు, విత్తనాలు నాటే యంత్రాలు, వాయు ఆధారిత పిండి చక్కీ, వెట్ గ్రైండర్లపై 12 కాకుండా 18 శాతం పన్ను విధిస్తారు.
Also Read: ప్రభువుల వారు కరుణించారు! జీఎస్‌టీ తగ్గించిన వస్తువుల జాబితా!
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!
పసిడి ప్రియులకు ఊరట - భారీగా పతనమైన వెండి ధర- లేటెస్ట్ రేట్లు ఇవీ
Top Loser Today August 17, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
RBI on Payment Systems: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!
Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!