GST Tax Rate Cut Check List of Items Which Get Cheaper: రెండు రోజుల పాటు సాగిన జీఎస్టీ మండలి సమావేశం (GST Counsil) ముగిసింది. చాలా వస్తువులపై పన్ను రేటును హేతుబద్ధీకరించారు. చాలా ఉత్పత్తులపై పన్నులు పెంచగా కొన్నింటిపై తగ్గించి కాస్త కరుణ చూపించారు.
Also Read: ప్యాక్ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!
ఏయే వస్తువులపై పన్ను తగ్గిందంటే?
రోప్ వే రైడ్స్: రోప్ వే ద్వారా ప్రయాణించే ప్యాసెంజర్లు, రవాణా ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ సేవలతో కలిపి 18 శాతం నుంచి 5కు తగ్గించారు.
వస్తు రవాణా కిరాయి: ఉత్పత్తులు, వస్తువుల రవాణా కిరాయిపై జీఎస్టీని కత్తిరించారు. 18 నుంచి 12 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందులో చమురు ఖర్చులనూ కలిపారు.
కీళ్ల ఉత్పత్తులు: కాళ్లు, చేతులు విరిగినప్పుడు వేసే స్పింటులు, ఫ్రాక్చర్ పనిముట్లు, కృత్రిమ అవయవాలు, శరీర అవసరాల కోసం ఉపయోగించే వైద్య పరికరాలు/వస్తువులు, రోగం లేదా వైకల్యం నుంచి రక్షించుకొనేందుకు ఇంప్లాంట్ చేసుకొనే ఉపకరణాలు, కొన్ని రకాల అద్దాలపై జీఎస్టీని కోసేశారు. 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
రక్షణ రంగ ఉత్పత్తులు: ప్రైవేటు కంపెనీలు, అమ్మకం దారుల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై ఐజీఎస్‌టీని మినహాయించారు.
Also Read: రూపాయి.. నువ్వే బక్కచిక్కితే ఎట్లా!! మేం ఎట్లా బతకాలి చెప్పు!!
Also Read: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!