హీరో తన ఎక్స్‌టెక్ రేంజ్‌లో ప్యాషన్ బైక్‌ను యాడ్ చేసింది. అదే హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్. సాధారణ ప్యాషన్‌కు కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా మిగతా ఫీచర్లలో కూడా చాలా మార్పులు చేశారు. ఇందులో బ్లూటూత్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తక్కువ పెట్రోల్ ఉన్నప్పుడు ఇండికేట్ చేస్తుంది. అలాగే సర్వీస్ పెట్టాల్సిన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది.


దీన్ని ఫోన్‌కు పెయిర్ చేస్తే ఎస్ఎంఎస్ అలెర్ట్స్, కాల్ అలెర్ట్స్ కూడా వస్తాయి. దీంతోపాటు ఫోన్ బ్యాటరీ లెవల్ కూడా చూసుకోవచ్చు. కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్రాండింగ్, కొత్త రిమ్ టేప్, ఫైవ్ స్పోక్ అలోయ్ వీల్స్2ను ఇందులో అందించారు. హాలోజెన్ ల్యాంప్ కంటే 12 శాతం పొడవైన బీమ్‌ను దీని హెడ్‌ల్యాంప్ అందించనుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ కటాఫ్ సిస్టం కూడా ఉంది.


ఈ కొత్త ప్యాషన్ ఎక్స్‌టెక్‌లో 110 సీసీ బీఎస్-4 ఇంజిన్‌ను అందించారు. ఇది 7,500 ఆర్‌పీఎం వద్ద 9 బీహెచ్‌పీని, 5,000 ఆర్‌పీఎం వద్ద 9.79 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. మైలేజ్‌ను పెంచే ఐ3ఎస్ టెక్నాలజీ అందించారు. స్టార్ట్/స్టాప్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


ప్యాషన్ ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.74,590గానూ, డిస్క్ వేరియంట్ ధర రూ.78,990గానూ నిర్ణయించారు. ప్రస్తుతం ఎక్స్‌టెక్ రేంజ్‌లో స్ప్లెండర్ ప్లస్, గ్లామర్ 125, ప్లెజర్ ప్లస్ 110, డెస్టినీ 125 బైక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బైక్‌కు టీవీఎస్ రేడియోన్ గట్టి పోటీ ఇస్తుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?