search
×

Gold-Silver Price: నేడు బిగ్ గుడ్‌న్యూస్! భారీగా బంగారం పతనం, వెండి కూడా కిందికి

ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,000 గా ఉంది.

FOLLOW US: 
Share:

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది. ఏకంగా 10 గ్రాములకు రూ.900 తగ్గింది. ఇక వెండి ధర నేడు రూ.300 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,000 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,300 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,300 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,300 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.42 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.23,350 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 30 Jun 2022 06:45 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

టాప్ స్టోరీస్

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు