By: ABP Desam | Updated at : 23 Sep 2023 06:36 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Gold-Silver Price Today 22 September 2023: అభివృద్ధి చెందిన దేశాల కేంద్ర బ్యాంకుల నిర్ణయాల కోసం ట్రేడర్లు ఎదురు చూస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటు స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,952 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర స్వచ్ఛమైన పసిడి ధర ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. కిలో వెండి రేటులో కూడా మార్పు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,850కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,840గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,850 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,840గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 79,000గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,110కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,840కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,00గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,940గా నమోదైంది. జైపుర్, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,850 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,840గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹54,850 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,840గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,850 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹59,840 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 420 తగ్గి ₹ 24,640 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Affordable Housing: అఫర్డబుల్ హౌసింగ్ పరిమితి రూ.80 లక్షలు, గృహ రుణ వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు!
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు