By: ABP Desam | Updated at : 11 Jul 2022 06:55 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉంది. అంతకుముందు 10 గ్రాములకు రూ.100 పెరిగింది. ఇక వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. ముందు రోజు కిలోకు రూ.300 మేర ఎగబాకింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.46,950 గా స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,210 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.62,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.62,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,210గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.62,800 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.49 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.22,710 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Stock Market Trading: ట్రేడింగ్లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే!
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వార్నింగ్
High Interest: ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్నా ? కేటీఆర్నా ?
Mahindra Thar: దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!