Pension Plan: సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన (APY). వృద్ధాప్యంలో డబ్బుకు ఇబ్బంది లేకుండా గడపాలన్న కల APY ద్వారా నెరవేరుతుంది. ఇది పెన్షన్ స్కీమ్, ప్రభుత్వమే పెన్షన్ హామీ ఇస్తుంది. ప్రతిరోజూ చాలా కొద్ది మొత్తం పొదుపు ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు.
ప్రతి నెలా రూ.5000 పెన్షన్
అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పొందడానికి కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అంటే, ఒక వ్యక్తికి 40 ఏళ్లు వచ్చినప్పుడు కూడా పెట్టుబడిని ప్రారంభించొచ్చు, 60 ఏళ్లు వచ్చిన వెంటనే పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది.
పెన్షన్ లెక్కను అర్థం చేసుకోవడానికి, మీ వయస్సు 18 సంవత్సరాలు అనుకుందాం. ఈ పథకంలో ప్రతి నెలా రూ. 210, అంటే రోజుకు రూ. 7 జమ చేస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 5000 పెన్షన్ తీసుకోవచ్చు. రూ. 1,000 పెన్షన్ చాలు అనుకుంటే ఈ వయస్సులో ప్రతి నెలా రూ. 42 మాత్రం డిపాజిట్ చేస్తే సరిపోతుంది.
ఈ పథకంలో 5 కోట్ల మంది
అటల్ పెన్షన్ యోజనలో చేరడం ద్వారా భార్యాభర్తలిద్దరూ కలిసి నెలకు రూ. 10,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భర్త 60 ఏళ్లలోపు మరణిస్తే భార్యకు పెన్షన్ ఫెసిలిటీ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ మరణిస్తే నామినీకి మొత్తం డబ్బు తిరిగి వస్తుంది. అటల్ పెన్షన్ యోజన రిటైర్మెంట్ ప్లాన్ బాగా పాపులర్ అయింది. 2015-16 సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్కీమ్‌లో చేరిన సభ్యుల సంఖ్యను బట్టి ఎంత ఆదరణ లభిస్తోందో అంచనా వేయవచ్చు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా ప్రజలు APY పథకంలో చేరారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత రెగ్యులర్ ఆదాయాన్నిల కచ్చితంగా డ్రా చేయొచ్చు.
పన్ను మినహాయింపు ప్రయోజనం
APY పథకంలో పెట్టుబడి మీద గ్యారెంటీ పెన్షన్‌ను పొందడమే కాదు, మరికొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే, రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80C కింద ఈ మినహాయింపు లభిస్తుంది.
ఈ పథకంలో ఖాతా తెరవడానికి పెద్ద అర్హతలే అవసరం లేదు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను తెరవడానికి, చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి, అది ఆధార్ కార్డ్‌తో అనుసంధానమై ఉండాలి. దరఖాస్తుదారుకు మొబైల్ నంబర్ కూడా ఉండాలి. అతను ఇప్పటికే అటల్ పెన్షన్ లబ్ధిదారుగా ఉండకూడదు.
గత సంవత్సరం (2022లో), ఈ పథకం రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి వీల్లేదు. ఈ మార్పు 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
మరో ఆసక్తికర కథనం: నం.1 బ్రోకర్ ముఖం మారింది, మనందరికీ తెలిసిన కంపెనీ ఇప్పుడా ప్లేస్‌లో లేదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial