High Interest Rates On Bank Fixed Deposits: భారతదేశంలో, ప్రజల దీర్ఘకాలిక పొదుపు/ పెట్టుబడి ప్రణాళికల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు (Bank FDs) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి, స్థిరమైన &హామీతో కూడిన పెట్టుబడి రాబడిని అందిస్తాయి. ఆర్థిక మార్కెట్లలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, ఆ ప్రభావం ఎఫ్‌డీ మీద ఉండదు. స్థిరత్వం & నమ్మకమైన రాబడికి విలువనిచ్చే పెట్టుబడిదారుల కోసం FDలు పాపులర్ ఆప్షన్‌గా పని చేస్తున్నాయి. దీర్ఘకాలికమే కాదు, మీరు స్వల్పకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకులు లేదా అనేక ఆర్థిక సంస్థలు మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (SFBs) వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రజలు SFBల్లో ఎఫ్‌డీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం, వివిధ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (North East Small Finance Bank) 3 కోట్ల రూపాయల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 9 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తోంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Utkarsh Small Finance Bank), తన FD కస్టమర్లకు గరిష్టంగా 8.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank) మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ ఆదాయం అందిస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank), తన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు (SBI FD Rates)
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సాధారణ పౌరులకు ఎఫ్‌డీపై 5.30 శాతం నుంచి 5.40 శాతం వడ్డీ రేటును & సీనియర్ సిటిజన్‌లకు 5.80 శాతం నుంచి 6.20 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌ని అర్థం చేసుకోండి
FD ద్వారా, నిర్ణీత కాలం కోసం, ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుతో పెట్టుబడి పెడతారు. FDలో ఏకమొత్తంలో డిపాజిట్ చేయాలి. కాల వ్యవధి ముగియగానే, నిర్దేశిత రేటు ప్రకారం వడ్డీ ఆదాయం వస్తుంది. పెట్టుబడిదారుడు సీనియర్ సిటిజన్ అయితే, అతనికి సాధారణ పౌరుల కంటే అధిక వడ్డీ రేటు అందుతుంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు, పోస్టాఫీస్, ఇతర ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద గరిష్టంగా 10 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఈఎంఐ చెల్లింపుల్లో అందరిలాగే మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? - తప్పదు భారీ నష్టం!