search
×

NRE FD Rates: కొత్త వడ్డీ రేట్లు ప్రకటన, ఏ బ్యాంక్‌ ఎంత ఆఫర్‌ చేస్తోందో తెలుసుకోండి

విదేశాల్లో నివశించే వ్యక్తులు, భారతదేశంలోని తమ బ్యాంకు ఖాతాల్లోకి విదేశీ కరెన్సీని డిపాజిట్ చేస్తారు.

FOLLOW US: 
Share:

NRE FD Rates: NRE అకౌంట్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

NRE ఖాతా అంటే ఏంటి?
ముందుగా, NRE అకౌంట్‌ అంటే ఏంటో తెలుసుకుందాం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIలు) తమ బ్యాంక్‌ ఖాతాలను భారతదేశంలోనే ప్రారంభించవచ్చు. విదేశాల్లో నివశించే వ్యక్తులు, భారతదేశంలోని తమ బ్యాంకు ఖాతాల్లోకి విదేశీ కరెన్సీని డిపాజిట్ చేస్తారు. అలాంటి బ్యాంక్ ఖాతాను నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ అకౌంట్‌ [Non-resident (External) Account] అంటారు. ఈ ఖాతాలోకి విదేశీ కరెన్సీని డిపాజిట్‌ చేస్తే, భారతీయ రూపాయిల రూపంలో విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాను వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తెరవవచ్చు.

NRE అకౌంట్‌ FD రేట్లు
నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ ఖాతాల్లో.. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఉంటాయి. NRE ఖాతాకు వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఖాతాలపై కనీస కాల పరిమితి (డిపాజిట్‌ మెచ్యూరిటీ టైమ్‌) ఒక సంవత్సరం. ఇంతకంటే తక్కువ కాలానికి ఈ ఖాతాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడానికి లేదు.

ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్‌ రంగం వరకు NRE ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఒకటి నుంచి పదేళ్ల కాల గడువుకు, రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద ఏడాదికి 6.50 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. అదే సమయంలో, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 6.00 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఫిబ్రవరి 15, 2023 నుంచి కొత్త రేట్లను బ్యాంక్ అమలు చేసింది.

HDFC బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తరపున, ఎన్‌ఆర్‌ఈ ఖాతాదార్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్‌ మొత్తానికి 6.60 శాతం నుంచి 7.10 శాతం వరకు వార్షిక వడ్డీని చెల్లిస్తోంది. రెండు కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 7.10 శాతం నుంచి 7.75 శాతం వరకు అందజేస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 21, 2023 నుంచి అమలులోకి వస్తాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ NRE FD రేటును పెంచింది. గతేడాది రేట్లు 5.6 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రేట్లను 6.5 శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. జనవరి 1, 2023 నుంచి ఈ రేట్లను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అమలు చేస్తోంది.

ICICI బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 6.70 శాతం నుంచి 7.10 శాతం వరకు ప్రకటించింది. ఈ రేట్లు ఫిబ్రవరి 24, 2023 నుంచి వర్తిస్తాయి.

కెనరా బ్యాంక్
NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఏడాది నుంచి పదేళ్ల కాలానికి 6.70 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేటును కెనరా బ్యాంక్ నిర్ణయించింది. కెనరా బ్యాంక్ రేట్లు ఏప్రిల్ 5, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.

Published at : 19 Apr 2023 02:38 PM (IST) Tags: FD rates fixed deposit rates NRE Account

సంబంధిత కథనాలు

Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్‌ కూడా వస్తాయ్‌

Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్‌ కూడా వస్తాయ్‌

Latest Gold-Silver Price Today 31 May 2023: దడ పుట్టించిన సిల్వర్‌ - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 31 May 2023: దడ పుట్టించిన సిల్వర్‌ - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

NPS: రిటైర్మెంట్‌ తర్వాత ₹6 కోట్లు, నెలకు ₹50 వేల పెన్షన్- బిందాస్‌గా బతకొచ్చు

NPS: రిటైర్మెంట్‌ తర్వాత ₹6 కోట్లు, నెలకు ₹50 వేల పెన్షన్- బిందాస్‌గా బతకొచ్చు

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !