search
×

Budget 2024: యాన్యుటీ-పెన్షన్‌ ప్లాన్స్‌పై పన్ను తీసేస్తారా, టర్మ్‌ ప్లాన్స్‌కు ప్రత్యేక మినహాయింపు ఇస్తారా?

ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో కనీసం 40% మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి.

FOLLOW US: 
Share:

Budget 2024 Expectations: భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman). ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget 2024) సమర్పిస్తారు. ఇది పూర్తి స్థాయి పద్దు కాకపోయినా, ఎన్నికల సమయంలో తెస్తున్న బడ్జెట్‌ కాబట్టి ప్రజలకు దీని మీద కొన్ని ఆశలున్నాయి.

బడ్జెట్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వేతన జీవులే. మన దేశంలో కచ్చితంగా ఆదాయ పన్ను చెల్లించేది వాళ్లే అదే కాబట్టి, శాలరీడ్‌ సెగ్మెంట్‌ నుంచి బడ్జెట్‌ మీద కోరికలు, అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఈసారి బడ్జెట్‌కు సంబంధించి యాన్యుటీ & పెన్షన్‌ ప్లాన్స్‌ గురించి చర్చ జరుగుతోంది.

పెన్షన్ & యాన్యుటీ ప్లాన్స్‌ (Pension & Annuity Plans)

ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో కనీసం 40% మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి. కాబట్టి, ఆ తరహా ప్రొడక్ట్స్‌ మీద పన్నులు తగ్గించాలి లేదా పూర్తిగా మాఫీ చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(1B) (Section 80CCD(1B) of the Income Tax Act) కింద, నేషనల్ పెన్షన్ స్కీమ్ ‍‌(NPS) కోసం ప్రస్తుతం రూ. 50,000 పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్‌ పరిధిని మరింత విస్తరించాలని బీమా కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాయి. 

యాన్యుటీ & పెన్షన్‌ ప్లాన్స్‌ మీద పన్ను మినహాయింపును (tax exemption) పెంచితే, అది టాక్స్‌పేయర్లతో పాటు బీమా పరిశ్రమకు కూడా లాభంగా మారుతుంది. పన్ను తగ్గడం వల్ల మరింత పెద్ద మొత్తంతో బీమా పాలసీలు తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు, బీమా ఉత్పత్తుల్లోకి పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా, బీమా పథకాల స్థాయి కూడా పెరుగుతుంది.

దీంతో పాటు, పెన్షన్ & యాన్యుటీ ప్లాన్స్‌ మీద 0% జీఎస్‌టీని GST రేటును సెట్ చేయాలని బీమా కంపెనీలు ప్రభుత్వానికి విన్నవించాయి. దీని అర్ధం.. ఆ తరహా ప్లాన్స్‌ మీద జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేయడం. తద్వారా, పాలసీలు తీసుకునే  వ్యక్తులపై పన్ను భారం (tax load) తగ్గుతుంది.

ఫైనల్‌గా, బీమా పరిశ్రమ చెబుతున్నది ఇది.. "సెక్షన్ 80CCD(1B) కింద NPSకి ప్రస్తుతం ఉన్న ₹50,000 పన్ను మినహాయింపును పెన్షన్ & యాన్యుటీ ప్లాన్స్‌కు కూడా వర్తింపజేయాలి. తద్వారా ఎక్కువ మంది ప్రజలు వాటిని ఉపయోగించుకుంటారు".

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Life Insurance)

ప్రస్తుతం, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపును అందిస్తున్నారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (tax saving fixed deposits), ఈక్విటీ లింక్డ్‌ టాక్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (ELSS), స్కూల్‌ ఫీజులు, జీవిత బీమా వంటివి ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి. వీటితో కలిపి కాకుండా, పాత పన్ను విధానంలో, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా పన్ను మినహాయింపు పరిమితిని అనుమతించాలని బీమా పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. 

జీవిత & ఆరోగ్య బీమా పథకాలను, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పథకాలను ఒకే గాటన కట్టకుండా... వేర్వేరుగా పన్ను మినహాయింపులు అందించేలా 80C & 80Dని మార్చాలని ఇటు పాలసీహోల్డర్లు, అటు బీమా పరిశ్రమ కోరుకుంటోంది. కొసమెరుపు ఏంటంటే.. జీవిత బీమా చెల్లింపుల విషయంలో ప్రత్యేకంగా టాక్స్‌ ఎగ్జమ్షన్‌ ఇవ్వమని గత ఐదారు సంవత్సరాలుగా బీమా పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మరో ఆసక్తికర కథనం: నాలుగో అతి పెద్ద స్టాక్‌ మార్కెట్‌ టైటిల్‌ మనదే, హాంగ్‌ కాంగ్‌ను బీట్‌ చేసిన భారత్

Published at : 23 Jan 2024 12:24 PM (IST) Tags: Income Tax Nirmala Sitharaman Tax exemption expectations Pension Pension Plans Budget 2024 Annuity plans Insurance Plans

ఇవి కూడా చూడండి

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

టాప్ స్టోరీస్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?