search
×

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు భారీ వడ్డీ ఆఫర్లు, బ్యాంక్‌లు రెడీగా ఉన్నాయ్‌!

చాలా బ్యాంకుల్లో, ముఖ్యంగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల్లో (SFBs) సీనియర్‌ సిటిజన్లకు ఎఫ్‌డీల మీద 9 శాతానికి పైగా వడ్డీ ఆదాయం లభిస్తోంది.

FOLLOW US: 
Share:

Interest Rates On Senior Citizen FDs in Various Banks: డబ్బును పెట్టుబడిగా పెట్టే సంప్రదాయ మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) ఒకటి. ఇందులోని పెట్టుబడులకు రిస్క్‌ చాలా తక్కువగా ఉంటుంది, ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది.

సాధారణంగా, బ్యాంక్‌ డిపాజిట్ల కూడా ఇన్సూరెన్స్‌ ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అనుబంధ సంస్థ అయిన 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్' (DICGC), ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ. 5 లక్షల వరకు పెట్టుబడులకు హామీ ఇస్తుంది. అంటే.. సదరు బ్యాంక్‌ మూతబడినా, ఎఫ్‌డీ మొత్తంలో గరిష్టంగా రూ.5 లక్షల వరకు తిరిగి వస్తుంది. అందుకే.. పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ వేయకుండా, రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయమని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తారు.

సాధారణ డిపాజిటర్లతో (60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వ్యక్తులు) పోలిస్తే సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) బ్యాంక్‌ల్లో ఎక్కువ ప్రాధాన్యత, ప్రయోజనాలు ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో.. అన్ని బ్యాంక్‌లు సాధారణ డిపాజిట్ల కంటే సీనియర్‌ సిటిజన్లకు ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం, చాలా బ్యాంకుల్లో, ముఖ్యంగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల్లో (SFBs) సీనియర్‌ సిటిజన్లకు ఎఫ్‌డీల మీద 9 శాతానికి పైగా వడ్డీ ఆదాయం లభిస్తోంది.

వివిధ బ్యాంక్‌ల్లో సినియర్‌ సిటిజన్‌ FD రేట్లు (Senior Citizen FD Rates):

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank FD Rates): 
07 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీ ఆదాయం. 
1001 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకంపై అత్యధికంగా 9 శాతం వడ్డీ రేటు. 
కొత్త వడ్డీ రేట్లు 2024 ఫిబ్రవరి 02 నుంచి అమలు.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank FD Rates): 
07 రోజుల (ఒక వారం) నుంచి 10 ఏళ్ల టైమ్‌ డిపాజిట్లపై 4 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ 
444 రోజుల ప్రత్యేక స్కీమ్‌లో సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ కలిపి గరిష్టంగా 9 శాతం ఆఫర్‌. 
కొత్త వడ్డీ రేట్లు 2023 ఆగస్టు 21 నుంచి అమలు.

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (Jana Small Finance Bank FD Rates): 
07 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్‌ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 9 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌. 
365 రోజుల స్పెషల్‌ డిపాజిట్‌పై 9 శాతం వడ్డీ ఆదాయం. 
కొత్త వడ్డీ రేట్లు 2024 జనవరి 02 నుంచి అమలు.

సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (Suryoday Small Finance Bank FD Rates): 
07 రోజుల నుంచి 10 ఏళ్ల కాల వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ. 
ప్రత్యేక పథకమైన 2 సంవత్సరాల 2 రోజుల స్కీమ్‌పై అత్యధికంగా 9.10 శాతం ఇంట్రెస్ట్‌ రేట్‌.
కొత్త వడ్డీ రేట్లు 2023 డిసెంబరు 22 నుంచి అమలు.

ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ‍‌(Fincare Small Finance Bank FD Rates): 
07 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య టైమ్‌ డిపాజిట్లపై 3.06 శాతం నుంచి 9.21 శాతం ఇంట్రెస్ట్‌ రేట్లు. 
750 రోజుల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో గరిష్టంగా 9.21 శాతం వడ్డీ ఆదాయం.
కొత్త వడ్డీ రేట్లు 2023 అక్టోబర్‌ 28 నుంచి అమలు.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Utkarsh Small Finance Bank FD Rates): 
07 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ గల ఎఫ్‌డీలకు 4.60 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ చెల్లింపు. 
రెండేళ్లు, మూడేళ్ల వ్యవధి గల డిపాజిట్లపై 9.10 శాతం వడ్డీ రేటు.
కొత్త వడ్డీ రేట్లు 2023 ఆగస్టు 21 నుంచి అమలు.

మరో ఆసక్తికర కథనం: ఇంకా జనం చేతుల్లోనే రూ.8,897 కోట్లు - పొదుగుతున్నారా ఏంటి?

Published at : 26 Feb 2024 01:29 PM (IST) Tags: fixed deposits banking Senior Citizen FDs Interest Rates

ఇవి కూడా చూడండి

Retirement Corpus: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్‌ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!

Retirement Corpus: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్‌ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?

Gold-Silver Prices Today 08 Jan: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 08 Jan: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్‌ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్‌ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

PVC Aadhaar Card: క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు

PVC Aadhaar Card: క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు

టాప్ స్టోరీస్

Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ

Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ

Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?

Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?

Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి

Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి

Vizag Modi Speech : చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా

Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా