Withdrawl Money From A Deceased Person's ATM Card: ఒక కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే ఆ దుఃఖాన్ని, షాక్‌ను భరించడం చాలా కష్టం. మరణించిన వ్యక్తికి చెందిన బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, అప్పుల వంటి ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోవడం, వాటిని ఒకదారికి తెచ్చుకోవడం, నిర్వహించడం వంటి పనులు కూడా ఆ కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందిగా మారతాయి. బ్యాంక్ ఏటీఎం కార్డ్ ఉన్నా, దాని పిన్ గురించి తెలీదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్, స్థిరాస్తుల్లో పెట్టుబడులు ఉన్నయేమో తెలుసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మనిషి లేడనే బాధ ఒకవైపు, ఆర్థిక లావాదేవీల గురించిన ఆందోళన మరోవైపు గుండెల్ని పిండేస్తుంది.
ఒకవేళ, మరణించిన వ్యక్తికి చెందిన ATM కార్డ్ ఉంటే... ఆ కార్డ్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయొచ్చా, లేదా అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. మిగిలిన వారికి అవసరం లేకపోయినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయంలో క్లారిటీ అవసరం.
మరణించిన వ్యక్తికి చెందిన ATM కార్డు నుండి డబ్బు విత్‌డ్రా చేయడం చట్టవిరుద్ధం (illegal), నేరం. ఒకవేళ మీరు ఆ కుటుంబంలోని వ్యక్తి లేదా నామినీ అయినప్పటికీ, మృతుడి ఖాతాలో డబ్బును యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా చట్టపరమైన విధానాలు పాటించాలి.
మరణించిన వ్యక్తికి చెందిన డబ్బును తీసుకోవడానికి చట్టపరమైన విధానాలు:
బ్యాంకుకు చెప్పడం:
మొట్టమొదట, ఖాతాదారు చనిపోయిన విషయం గురించి సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు చెప్పాలి. ఒకవేళ, నామినీ అయినా, కాకపోయినా ఇలాంటి సమాచారం ఇవ్వొచ్చు.
నామినీ ఉంటే:
మరణించిన వారి ఖాతా వివరాల్లో నామినీ పేరు ఉంటే, ఖాతాదారు మరణం గురించి నామినీ కూడా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. తానే నామినీ అని తగిన గుర్తింపు పత్రాలతో నిరూపించుకోవాలి. ఒకవేళ, ఎక్కువ మంది నామినీలు ఉంటే, వాళ్లందరు కూడా తమను తాము నిరూపించుకోవాలి.
చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయాడానికి అవసరమైన పత్రాలు (Documents required):
ఖాతాదారుడి మరణ ధృవీకరణ పత్రం
పాస్‌బుక్, చెక్‌బుక్, TDR వంటి ఇతర పత్రాలు
నామినీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
ఈ పేపర్లను సంబంధించి బ్యాంక్ బ్రాంచ్‌లో ఇచ్చిన తర్వాత, బ్యాంక్ అధికార్లు వాటిని పరిశీలిస్తారు. ఈ పని పూర్తయిన తర్వాత, మృతుడి ఖాతాలో డబ్బు తీసుకోవడానికి అనుమతి దొరుకుతుంది.
ఆస్తుల బదిలీ:
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడానికి ముందే, ఆ వ్యక్తికి చెందిన ఆస్తులు చట్టబద్ధ వారసుడికి లేదా నామినీకి ట్రాన్స్‌ఫర్ జరిగి ఉండాలి.
చట్టపరమైన చర్యలు:
రూల్స్ పాటించకుండా, మరణించిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో జరిమానా విధించొచ్చు లేదా జైలుకు కూడా పంపేందుకు ఆస్కారం ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఏం స్టాక్ గురూ ఇది - ఫస్ట్ రోజే మల్టీబ్యాగర్, ఒక్కో లాట్‌పై భారీ లాభం