LIC Endowment Plans: దేశంలోని అతి పెద్ద జీవిత బీమా కంపెనీ 'ఎల్‌ఐసీ' (Life Insurance Corporation of India), తన పాపులర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై, కొత్త ఎండోమెంట్ ప్లాన్ (Endowment Plan) తీసుకునేందుకు కనీస వయస్సును 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించింది. ఈ మార్పులు వృద్ధుల ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. దీంతోపాటు. ఈ ప్రభుత్వ రంగం సంస్థ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఈ నిబంధనలను అక్టోబర్ 01, 2024 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
ఎండోమెంట్ ప్లాన్స్‌లో లైఫ్ కవర్‌తో పాటు మెచ్యూరిటీ ప్రయోజనాలు
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం... LIC ప్రారంభించిన కొత్త ఎండోమెంట్ ప్లాన్-914, పాలసీహోల్డర్లకు రక్షణ కవరేజీని అందించడమే కాకుండా పొదుపులాగా కూడా పని చేస్తుంది. ఈ ప్లాన్‌లో, పాలసీహోల్డర్ మరణ ప్రయోజనాలు & మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, ఎండోమెంట్ ప్లాన్‌తో కూడిన ఏ జీవిత బీమా పాలసీలోనైనా లైఫ్ కవర్‌తో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. కాబట్టి, పాలసీ రన్నింగ్ సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అతని కుటుంబానికి డబ్బులు చెల్లిస్తుంది. అలాగే, పాలసీ మెచ్యూరిటీపైనా వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఈ మార్పులకు సంబంధించి ఎల్‌ఐసీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
మరో ఆసక్తికర కథనం: ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పు, బెనిఫిట్స్ కట్ - ఇన్ని ప్రయోజనాలు తగ్గాయి
LICలో ఆరు ఎండోమెంట్ ప్లాన్స్
LIC వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పటి వరకు ఈ కంపెనీకి ఆరు ఎండోమెంట్ పథకాలను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. అవి - ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ (LIC Single Premium Endowment Plan), ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ (LIC New Endowment Plan), ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ (LIC New Jeevan Anand), ఎల్‌ఐసీ జీవన్ లక్ష్య (LIC Jeevan Lakshya), ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ (LIC Jeevan Labh Plan), ఎల్‌ఐసీ అమృత్‌బాల్ (LIC Amritbaal). 01 అక్టోబర్ 2024 నుంచి ఈ ప్లాన్‌లు అన్నింటిలో మార్పులు జరిగాయి.
ప్రీమియం రేట్లు 10 శాతం పెంపు, హామీ మొత్తం పెంపు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభం నుంచి కొత్త సరెండర్ రూల్స్‌ను కూడా అమలు చేస్తోంది. కొత్త సరెండర్ వాల్యూ నిబంధనల ప్రకారం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దాదాపు 32 బీమా ప్లాన్స్‌లో మార్పులు చేసింది. ప్రీమియం రేట్లను కూడా దాదాపు 10 శాతం పెంచినట్లు తెలుస్తోంది. న్యూ జీవన్ ఆనంద్, జీవన్ లక్ష్య పథకాల్లో బీమా మొత్తాన్ని కూడా లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు పెంచారు. మరోవైపు.. ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎండోమెంట్ ప్లాన్‌ల ప్రీమియం రేట్లను 6 నుంచి 7 శాతం మాత్రమే పెంచాయి.
మరో ఆసక్తికర కథనం: దేశంలో 5 అత్యంత ఖరీదైన కార్లు, వాటి ఓనర్లు - తెలుగు వ్యక్తి దగ్గర టాప్ మోడల్