Most Luxurious Cars: దేశంలో 5 అత్యంత ఖరీదైన కార్లు, వాటి ఓనర్లు - తెలుగు వ్యక్తి దగ్గర టాప్‌ మోడల్‌

Most Costly Cars In India: భారతదేశంలో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే, అత్యంత లగ్జరీ కార్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి మోడల్‌ను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం సులభం కాదు.

Continues below advertisement

Most Expensive Cars In India and Their Owners: మన దేశంలో కోట్లాది మంది ఇళ్లలో కార్లు ఉన్నాయి. అతి చవకైన బేసిక్‌ మోడల్‌ నుంచి అత్యంత ఖరీదైన టాప్‌ ఎండ్‌ వరకు, ఎన్నెన్నో బ్రాండ్స్‌ భారతదేశ రహదారులపై పరుగులు తీస్తున్నాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఖరీదైన కారును కొనుగోలు చేయలేరు. గరాజ్‌లో అత్యంత ఖరీదైన & విలాసవంతమైన కార్లను పెట్టుకున్న వ్యక్తులు మన దేశంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.

Continues below advertisement

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు - వాటి యజమానులు

బెంట్లీ ముల్సన్నే ఈడబ్ల్యూబీ (Bentley Mulsanne EWB)
భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు బెంట్లీ ముల్సాన్ EWB, ఇది సూపర్ లగ్జరీ సెడాన్. ఈ లగ్జరీ కారు యజమాని బ్రిటిష్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ రెడ్డి (V.S.Reddy). ఈ కారును డెలివరీ చేసినప్పుడు, దీని ధర దాదాపు రూ.14 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ V8 ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 506 hp, 1020 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII ఈడబ్ల్యూబీ ‍‌(Rolls Royce Phantom Series VIII EWB)
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు, ఆ లిస్ట్‌ నుంచి అంబానీ కుటుంబాన్ని మినహాయించడం అసాధ్యం. ముకేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ (Mukesh Ambani's wife Nita Ambani) దగ్గర ఈ కార్‌ ఉంది. భారతదేశంలో రెండో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ఆన్-రోడ్ ప్రైస్‌ రూ.13 కోట్ల 50 వేలు. ఈ కారు పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే.. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V12 ఇంజిన్‌ దీని సొంతం. ఇది గరిష్టంగా 563bhp మరియు 900nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 

రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ (Rolls Royce Ghost Black Badge)
ఇండియన్‌ రోడ్‌ మీద తిరుగుతున్న మూడో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్. దీని ధర రూ.12 కోట్ల 25 వేలు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ దీని ఓనర్‌. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ 6.75-లీటర్ V12 ఇంజిన్‌తో వచ్చింది. ఇది స్టాండర్డ్‌ కార్‌ కంటే 29hp ఎక్కువ పవర్‌ను, 50Nm ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ ఇంజిన్ మొత్తం 600 PS పవర్, 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ZF 8-స్పీడ్ గేర్‌ బాక్స్ ఉంది. కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఇది 4.6 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని టచ్‌ చేస్తుంది.

మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ (McLaren 765 LT Spider)
ఈ లిస్ట్‌లో నాలుగో కారు మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం నాసీర్ ఖాన్‌ (Nasir Khan) సొంతం ఇది. ఈ కారు ధర రూ.12 కోట్లు. లగ్జరీ కార్లను ఇష్టపడేవారిలో నసీర్ పేరు ఎప్పుడూ అగ్రభాగాన కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా, తన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లను పార్క్ చేసాడు. నసీర్ ఖాన్ గరాజ్‌లో ఉన్న అత్యంత ఖరీదైన కారు మెక్‌లారెన్ 765 LT స్పైడర్. స్పోర్టీ లుక్‌తో రెడ్‌ షేడ్‌లో అద్భుతంగా కనిపించే MSO ఓల్కనో సూపర్‌కార్‌ ఆయన దగ్గరుంది.

మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌6000 గార్డ్‌ (Mercedes-Benz S600 Guard)
భారతదేశంలో ఐదో అత్యంత విలాసవంతమైన కారు మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌6000 గార్డ్‌. ముకేష్ అంబానీ కలెక్షన్స్‌లో ఉన్న లగ్జరీ కార్లలో ఇదొకటి. ఈ కారు ధర 10 కోట్ల రూపాయలు.

మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ ప్రారంభించబోతున్న జీరోధ - కామత్‌ సోదరుల ప్లాన్‌ ఇంకా ఉంది 

Continues below advertisement
Sponsored Links by Taboola