PVC Aadhaar Card: భారతదేశంలో ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు లేకపోయినా, ఇప్పటికే ఉన్న కార్డ్ పోయినా చాలా కీలకమైన పనులు ఆగిపోతాయి. ఒకవేళ మీ కార్డ్ కనిపించకుండా పోతే PVC ఆధార్ కార్డ్‌ను తెప్పించుకోవచ్చు. ఆధార్ జారీ చేసే సంస్థ 'యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI), PVC ఆధార్ కార్డ్‌ను ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి (PVC Aadhaar Card Online Order) అనుమతిస్తుంది. UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు.
కేవలం రూ. 50 కే కార్డు పొందండి
పాలీవినైల్ క్లోరైడ్, అంటే PVC ఆధార్ కార్డును (PVC Aadhaar Card Order Online Fees) కేవలం రూ. 50 చెల్లించి పొందవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటో, పుట్టిన తేదీ మొదలైన సమాచారం నమోదై ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ పోయినట్లయితే PVC ఆధార్ కార్డును ఎలా పొందాలో తెలుసుకుందాం.
PVC ఆధార్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా https://uidai.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆ తర్వాత, హోమ్ పేజీలో కనిపించే My Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇందులో Order Aadhaar PVC Card మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు 16 అంకెల వర్చువల్ ఐడీని కూడా ఇవ్వవచ్చు. దీని తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేయండి.
ఇప్పుడు, ఆధార్‌తో లింక్ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని సంబంధిత గడిలో పూరించి సబ్మిట్ చేయండి
ఆ తర్వాత, PVC ఆధార్ కార్డ్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
దీని తర్వాత మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ చెల్లింపు చేయవచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత, మీ PVC కార్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు వస్తుంది.
PVC ఆధార్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
కావాలంటే, PVC ఆధార్ కార్డును ఆఫ్‌లైన్‌లో కూడా మీరు పొందవచ్చు. దీని కోసం మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ, సంబంధిత ఫారం నింపాలి. ఆ తర్వాత PVC కార్డు కోసం రూ. 50 రుసుము చెల్లించాలి. విజయవంతమైన చెల్లింపు తర్వాత, ఈ కార్డ్ మీ ఇంటి చిరునామాకు 5 నుంచి 6 రోజుల లోపు వస్తుంది.
ఆధార్ లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందలేరు
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ప్రభుత్వ పథకాలు, పాఠశాల లేదా కళాశాల అడ్మిషన్, ఉద్యోగంలో చేరడం, ప్రయాణం వంటి సమయాల్లో ఆధార్ కార్డు అవసరం. దీంతో పాటు, బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతాల వంటివి తెరవడానికి, ఇతర చాలా ఆర్థిక సంబంధ పనులకు ఆధార్ ఉండాల్సిందే. కాబట్టి, మీ ఆధార్ కార్డ్ కనిపించకుండా పోతే, PVC ఆధార్ కార్డ్ కోసం వెంటనే ఆర్డర్ చేయండి, వీలైనంత త్వరగా దానిని పొందండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.