డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది! స్టాక్‌ మార్కెట్లో నమోదైన రెండో రోజు పది శాతానికి పైగా నష్టపోయింది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి 35 శాతం నష్టం నమోదు చేసింది. రూ.1350 వద్ద కదలాడుతోంది.

Continues below advertisement


పేటీఎం దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో. రూ.18,500 కోట్ల విలువైన ఇష్యూ. డిజిటల్‌ చెల్లింపుల్లో దేశంలోనే నంబర్‌వన్‌ కంపెనీ. చాలారోజులుగా ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూసిన ఈ ఐపీవో చివరికి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది! ఒక్కరోజే 27 శాతం షేరు ధర నష్టపోవడంతో మదుపర్లు దాదాపుగా కంటతడి పెట్టుకున్నారు.


ఒక్కో షేరు ధరను రూ.1250గా పేటీఎం నిర్ణయించింది. గ్రే మార్కెట్లో ప్రీమియం పడిపోవడంతో ఐపీవో రోజు ఇన్వెస్టర్లు కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యారు. వారు ఊహించినట్టుగానే గురువారం 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1950 వద్ద షేరు నమోదైంది. అటు మార్కెట్లు పతనం అవుతుండటం, నెగెటివ్‌ సెంటిమెంటు ఉండటం, మదుపర్లు విక్రయాలకు దిగడంతో పేటీఎం షేరు ధర అమాంతం పడిపోవడం మొదలైంది. వందో, రెండొందలో కాదు.. ఏకంగా రూ.500కు పైగా పతనమైంది. చివరికి 1564 వద్ద ముగిసింది. దాదాపుగా మార్కెట్లో ఐపీవోల్లో ఇదే అతిపెద్ద క్రాష్‌!


పేటీఎం లిస్టైన తర్వాత రోజు నుంచి మార్కెట్‌కు వరుసగా సెలవులు వచ్చాయి. సోమవారం ఆరంభం కాగానే సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక పేటీఎం సైతం మరో పది శాతం నష్టపోయింది. రూ.1350 వద్ద కదలాడుతోంది. మొత్తంగా షేరు 35 శాతం వరకు తగ్గడంతో చిన్న మదుపర్లు తీవ్ర నష్టాలను చవిచూశారు. కంపెనీ విలువను ఎక్కువ చూపి నమోదు చేయడంతోనే నష్టాలు వస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహుశా సరైన విలువ వద్ద దిద్దుబాటుకు గురయ్యాక షేరు ధర కోలుకొనే అవకాశం ఉంది.


Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. 4 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాల్లోకి ఎప్పుడంటే..!


Also Read: Multibagger share: 6 నెలల్లో లక్షకు రూ.2.62 కోట్ల రాబడి ఇచ్చిన పెన్నీ స్టాక్‌ ఇది!


Also Read: SBI ATM Cash Withdrawal: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! మోసగాళ్ల నుంచి రక్షణగా కొత్త రూల్‌


Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్‌ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్‌ సూపర్‌ హిట్టవుతుందా?


Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి