Stocks to watch today, 29 September 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 174 పాయింట్లు లేదా 1.03 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,060 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


వొడాఫోన్ ఐడియా: మొబైల్ టవర్ దిగ్గజం ఇండస్ టవర్స్ (Indus Towers), వొడాఫోన్‌ ఐడియాకి గట్టి షాకిచ్చింది. నవంబర్‌ తర్వాత తమ సర్వీసులు కొనసాగాలంటే పాత బకాయిలన్నీ చెల్లించాలని, ఇకపై ఒక్క రూపాయి కూడా ఆపకుండా సకాలంలో చెల్లింపులు చేయాలని అడిగినట్లు సమాచారం. దీనిని, వొడాఫోన్‌కు వార్నింగ్‌లాగా కూడా మనం చూడవచ్చు.


అంబుజా సిమెంట్స్: తీసుకున్న రుణాలను తీర్చడం కోసం, తన అనుబంధ సంస్థ ACC లిమిటెడ్‌లో 50 శాతానికి పైగా వాటాకు నాన్‌ డిస్పోజబుల్ అండర్‌టేకింగ్ (NDU) సృష్టించినట్లు అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఈ నెల 26న, 9.39 కోట్ల షేర్లకు NDU సృష్టించింది.


బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్: 2022తో పోలిస్తే 2023కి సగటు షిప్‌మెంట్ ధరలో 9.6 శాతం పెరుగుదలను ఈ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రకటించింది. ధర పెరుగుదల జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.


హిందుస్థాన్ కాపర్: మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 23.2 శాతం డివిడెండ్‌ను ఈ ప్రభుత్వ రంగ మెటల్ మైనర్ ప్రకటించింది. 55వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) దీనికి ఆమోదం పొందింది. డివిడెండ్‌ రూపంలో మొత్తం రూ.112.17 కోట్లను షేర్‌హోల్డర్లకు చెల్లిస్తుంది.


ఎల్జీ ఎక్విప్‌మెంట్స్‌: ఇటలీకి చెందిన కంపెనీ పోల్సెల్లి (Polselli), ఎల్జీ ఎక్విప్‌మెంట్స్‌ అనుబంధ సంస్థ ELGi Compressors Europe తయారు చేసిన 45 kW వాటర్-ఇంజెక్టెడ్‌ AB సిరీస్ స్క్రూ ఎయిర్ కంప్రెసర్‌లను ఎంచుకుంది. మిల్లింగ్‌, పిండి ఉత్పత్తి రంగంలో పోల్సెల్లి అగ్రస్థానంలో ఉంది.


అనుపమ్ రసాయన్ ఇండియా: ప్రిలిమినరీ ప్లేస్‌మెంట్ డాక్యుమెంట్ ఆమోదం పొందిన ఈ కెమికల్స్ కంపెనీ, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ఇష్యూను నిన్న (బుధవారం) ప్రారంభించింది. ఒక్కో షేరుకు ఫ్లోర్ ధరను రూ.762.88గా నిర్ణయించింది. ఇది ఫ్లోర్‌ ప్రైస్‌ మీద 5 శాతం వరకు తగ్గింపును కూడా ఇచ్చే అవకాశం ఉంది.


ఐటీఐ: భారత ప్రభుత్వానికి వాటాల కేటాయించి రూ.80 కోట్లను ఈ టెలికాం పరికరాల సంస్థ పొందింది. ఒక్కో షేరును రూ.103.45 చొప్పున 77,33,204 ఈక్విటీ షేర్లను భారత రాష్ట్రపతికి ఈ కంపెనీ కేటాయించింది.


కృష్ణ డయాగ్నోస్టిక్స్: ప్రస్తుతం 2,000 లొకేషన్లలో ఉన్న దీని నెట్‌వర్క్‌కు మరో 600 సెంటర్లను యాడ్‌ చేస్తోంది. ఈ విస్తరణ ద్వారా రిటైల్ హెల్త్‌కేర్ సేవలలోకి కూడా అడుగు పెడుతున్నట్లు ఈ లిస్టెడ్ కంపెనీ తెలిపింది.


యూకో బ్యాంక్: రూపాయిల రూపంలో వాణిజ్య కార్యకలాపాల సెటిల్‌మెంట్ కోసం, రష్యాకు చెందిన గాజ్‌ప్రామ్‌బ్యాంక్‌లో ప్రత్యేక ఓస్ట్రో (Vostro) ఖాతాను తెరిచే ప్రక్రియలో ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఉంది.


ఎడెల్‌వైస్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్: వచ్చే వారం ప్రారంభమయ్యే బాండ్ల పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.400 కోట్ల వరకు సమీకరించాలని ఈ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ యోచిస్తోంది. బేస్ ఇష్యూ సైజ్‌ రూ.200 కోట్లు కాగా, మరో రూ.200 కోట్ల వరకు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇష్యూ ద్వారా, రూ.1,000 ముఖ విలువ గల సెక్యూర్డ్‌ రీడీమబుల్‌ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (NCD) ఈ కంపెనీ జారీ చేస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.