By: ABP Desam | Updated at : 29 Aug 2022 08:47 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే
Stocks to watch in today's trade 29 August 2022: మరికొన్నాళ్లు ఆర్థిక వ్యవస్థకు నొప్పి తప్పదంటూ శుక్రవారం జాక్సన్ హోల్ సమావేశంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్లతో, ఆ రోజు అమెరికన్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. డౌజోన్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు లేదా 3 శాతం గల్లంతైంది. నాస్‌డాక్ 4 శాతం మేర, S&P 500 ఇండెక్స్ దాదాపు మూడున్నర శాతం నష్టపోయాయి. ఈ ప్రభావం ఇవాళ్టి (సోమవారం, 29.08.2002) మన మార్కెట్ల మీద కచ్చితంగా ఉంటుంది.
ఇక మన దేశంలో ఇవాళ (సోమవారం) జరిగే ఈవెంట్లలో అతి ముఖ్యమైనది, మార్కెట్ మీద ప్రభావం చూపే సత్తా ఉన్నది రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం). రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ 5జీ సేవల ప్రారంభం, రెన్యువబుల్ ఎనర్జీ బిజినెస్ భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా మాట్లాడవచ్చు. చాలాకాలంగా నానుతున్న టెలికాం (జియో), రిటైల్ బిజినెస్‌ల పబ్లిక్ ఇష్యూల మీద కూడా ముఖేష్ స్పష్టత ఇస్తారని మార్కెట్ అంచనా వేస్తోంది.
ఇవాళ ఉదయం 7.30 గం. సమయానికి SGX నిఫ్టీ ఫ్యూచర్స్ అతి భారీ నష్టాల్లో ఉంది. ఆ సమయంలో ఏకంగా 391.5 పాయింట్లు లేదా 2.22 శాతం క్షీణించి 17,267.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ప్రతికూలంగా ప్రారంభమవుతుందని ఇది సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
రిలయన్స్ ఇండస్ట్రీస్: అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ ఇవాళ తన 45వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించనుంది. వారసత్వ ప్రణాళిక, భవిష్యత్తు వ్యాపార దృక్పథం, రిటైల్, టెలికాం వ్యాపారాల IPOల మీద ముఖేష్ అంబానీ ఏం చెబుతారోనని ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్ట్రాటెక్ సిమెంట్: ఉత్తరప్రదేశ్‌లోని దల్లా సిమెంట్ వర్క్స్ సామర్థ్యాన్ని మరో 1.3 mtpaకు పెంచి, ప్రారంభించింది. దీని ఫలితంగా ఆ యూనిట్ కెపాసిటీ 1.8 mtpaకి పెరిగింది.
ఎన్‌టీపీసీ: 1,320 మెగావాట్ల తాల్చేర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-III కోసం రూ.11,843.75 కోట్ల పెట్టుబడికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇండిగో: ముగ్గురు డైరెక్టర్ల నియామకానికి, డైరెక్టర్‌గా అనిల్ పరాశర్‌ను తిరిగి నియమించడానికి ఈ ఏవియేషన్ ప్లేయర్ వాటాదారులు అనుమతించారు.
ఫెర్టిలైజర్ స్టాక్స్: యూరియా, డీఏపీ సహా అన్ని సబ్సిడీ ఎరువులను అక్టోబర్ 'భారత్' బ్రాండ్‌తోనే అన్ని కంపెనీలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఈ స్టాక్స్‌ను కూడా ఇవాళ పరిగణనలోకి తీసుకోవచ్చు.
సిప్లా: USFDA నుంచి ఈ డ్రగ్ మేకర్ ఆరు అబ్జర్వేషన్లను అందుకుంది. ఈ నెల 16-26 తేదీల మధ్య కంపెనీ గోవా ప్లాంట్‌ను USFDA తనిఖీ చేసింది.
బెర్గర్ పెయింట్స్: నవంబర్‌లో, లక్నో సమీపంలో పూర్తి ఆటోమేటెడ్ పెయింట్స్ తయారీ ఫ్లాంటును ప్రారంభించాలని చూస్తోంది. మొత్తం పెట్టుబడిని గతంలో అంచనా వేసిన రూ.800 కోట్ల నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పెంచింది.
సింజీన్ ఇంటర్నేషనల్: O2 రెన్యువబుల్ ఎనర్జీ-IIలో 26 శాతం వరకు వాటాను కొనడం ద్వారా పునరుత్పాదక శక్తిని కొనుగోలు చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎన్‌హెచ్‌పీసీ: హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో 500 మెగావాట్ల దుగర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ అమలు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
రోలెక్స్ రింగ్స్: ఎన్‌ఎస్‌ఈలో అందుబాటులో ఉన్న బల్క్ డీల్ డేటా ప్రకారం, Rivendell PE LLC, తన దగ్గరున్న రోలెక్స్ రింగ్స్‌కు చెందిన 34,14,423 షేర్లను సగటున రూ.1,700.13 చొప్పున రూ.580.49 కోట్లకు విక్రయించింది. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు), ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఈ షేర్లను కొన్నాయి.
ఎన్‌డీటీవీ: 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ మీడియా కంపెనీ తన వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. NDTV AGM సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది.
స్ట్రైడ్స్ ఫార్మా: గర్భిణులు, పిల్లల్లో ఇన్ఫెక్షన్‌ను నివారించే యాంటీమలేరియల్ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కెన్యాకు చెందిన తన యూనిట్ అనుమతి పొందిందని ఈ ఔషధ కంపెనీ ప్రకటించింది.
రైట్స్: రూ.361.18 కోట్లతో కొల్లం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి దక్షిణ రైల్వే నుంచి కొత్త ఆర్డర్ పొందింది. ఇదొక జాయింట్ వెంచర్. ఆర్డర్‌లో రైట్స్ వాటా 51 శాతం.
రిలయన్స్ క్యాపిటల్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ కోసం బిడ్‌ల సమర్పణల గడువు ఇవాళ్టితో ముగుస్తుంది.
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్: FY23 జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.135.96 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.348.08 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్