Stocks to watch today, 27 September 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 36 పాయింట్లు లేదా 0.21 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,057 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


అమరరాజా బ్యాటరీస్: అమరరాజా గ్రూప్‌ సంస్థ అయిన మంగళ్ ఇండస్ట్రీస్‌లోని బ్యాటరీ ప్లాస్టిక్ కాంపోనెంట్ వ్యాపారాన్ని అమరరాజా బ్యాటరీస్‌లో విలీనం చేయాలని ఈ బ్యాటరీ సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రక్రియ భాగంగా, మంగళ్ ఇండస్ట్రీస్ నుంచి ప్లాస్టిక్ కాంపోనెంట్ బ్యాటరీ వ్యాపారాన్ని విడదీసి, అమరరాజా బ్యాటరీస్‌లో కలుపుతారు.


వొడాఫోన్ ఐడియా: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌తో (EESL) ఒప్పందంలో ఉన్న ఈ టెలికాం ప్లేయర్, ఉత్తరప్రదేశ్ & హరియాణాలో మరో 33.3 లక్షల స్మార్ట్ మీటర్లను అమర్చనుంది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో భాగంగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 16.7 స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు.


మహీంద్ర లాజిస్టిక్: గురుగావ్‌ కేంద్రంగా పని చేస్తున్న లాజిస్టిక్స్ సంస్థ రివిగో సర్వీసెస్‌కు (Rivigo Services) చెందిన B2B ఎక్స్‌ప్రెస్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్ర లాజిస్టిక్ ప్రకటించింది. దీనివల్ల, రావాణా స్పేస్‌లో కంపెనీ సామర్థ్యం మరింత వేగవంతం అవుతుంది. ఈ కొనుగోలులో భాగంగా రివిగో B2B ఎక్స్‌ప్రెస్ వ్యాపారం, దాని సాంకేతిక ప్లాట్‌ఫామ్, కస్టమర్‌లు, సిబ్బంది, ఆస్తులు అన్నీ మహీంద్ర లాజిస్టిక్స్‌ చేతికి వస్తాయి.


BSE: ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్, తన ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్‌ను (EGR) ట్రేడ్‌ చేయడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నుంచి తుది ఆమోదం పొందింది. ఫిబ్రవరిలో సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందిన బీఎస్‌ఈ, ఈ విధానాన్ని పరీక్షించేందుకు అప్పట్నుంచి చాలా మాక్ ట్రేడింగ్ సెషన్లను నిర్వహించింది.


ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT: 7.7 కోట్ల ఎంబసీ REIT యూనిట్లను గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్లాక్‌స్టోన్ (Blackstone) ఇవాళ విక్రయించనున్నట్లు సమాచారం. ఈ బ్లాక్ డీల్స్ విలువ రూ.2,650 కోట్లు. బ్లాక్ డీల్స్‌లో ఒక్కో యూనిట్‌కు ఆఫర్ ప్రైస్‌ రూ.345.


మాస్‌టెక్‌: BSE డేటా ప్రకారం, ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన 5,49,676 షేర్లను లేదా 1.82 శాతం వాటాను స్మాల్‌ క్యాప్‌ వరల్డ్‌ ఫండ్‌ (Small Cap World Fund) కొనుగోలు చేసింది. బ్లాక్‌ డీల్‌లో, ఒక్కో షేరుకు రూ.1,759.97 సగటు ధర చొప్పున రూ.96.74 కోట్లకు పైగా వెచ్చించింది. ఇదే డీల్‌లో, 4,29,086 మాస్‌టెక్‌ షేర్లను హార్న్‌బిల్ ఆర్కిడ్‌ ఇండియా ఫండ్ (Hornbill Orchid India Fund) విక్రయించింది.


ఫిలాటెక్స్ ఇండియా: ఈ స్మాల్‌ క్యాప్ టెక్స్‌టైల్ సంస్థ, తన దహేజ్ ప్లాంట్‌లో రోజుకు 50 MT మెల్ట్ కెపాసిటీ, 120 MT ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టును ప్రారంభించింది.


జీ మీడియా కార్పొరేషన్: జీ మీడియాకు సంబంధించిన కేసులో, నిబంధనలు పాటించనందుకు 25FPS మీడియాకు రూ.4 లక్షల జరిమానాను సెబీ విధించింది. జీ మీడియా కార్పొరేషన్‌కు 25FPS మీడియా ఒక ప్రమోటర్‌ సంస్థ.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.