By: ABP Desam | Updated at : 21 Sep 2022 08:39 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 21 సెప్టెంబరు 2022
Stocks to watch today, 21 September 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 85.5 పాయింట్లు లేదా 0.47 శాతం రెడ్ కలర్‌లో 17,710.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
విప్రో: మన దేశంలోని కార్పొరేట్ బ్యాంకులను డిజిటల్ మోడ్‌లోకి మార్చేందుకు, ఐటీ సేవల కంపెనీ విప్రో, యూకేకి చెందిన ఫినాస్ట్రా (Finastra) భాగస్వామ్య ప్రాజెక్టును ప్రకటించాయి. భారత్‌లోని అన్ని బ్యాంకులకు గో-టు-మార్కెట్ పార్ట్‌నర్‌గా విప్రోను నిలపడం ఈ రెండు కంపెనీల మల్టీ ఇయర్ పార్ట్‌నర్‌షిప్ లక్ష్యం.
హీరో మోటోకార్ప్: ఎలక్ట్రిక్ బైకులకు ఛార్జింగ్ పెట్టుకునేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో (HPCL) హీరో మోటోకార్ప్ చేతులు కలిపింది. తొలి విడతగా, ప్రస్తుతమున్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఈ రెండు కంపెనీలు ఏర్పాటు చేస్తాయి.
టాటా స్టీల్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, గుర్తించిన పెట్టుబడిదారులకు 20,000 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను NCDs టాటా స్టీల్ కేటాయించింది. ఒక్కో NCD ముఖ విలువ రూ.10 లక్షలు. తద్వారా రూ.2,000 కోట్లను కంపెనీ సమీకరించింది. ఈ NCDలను BSE హోల్‌సేల్ డెట్ మార్కెట్ (WDM) విభాగంలో లిస్ట్ చేస్తారు.
యెస్ బ్యాంక్: ఏకైక బిడ్డర్ జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీకి (JC Flowers ARC) దాదాపు రూ.48,000 కోట్ల విలువైన 'ఒత్తిడిలో ఉన్న ఆస్తులను' (స్ట్రెస్డ్ అసెట్స్) విక్రయించడానికి యెస్ బ్యాంక్ బోర్డు ఆమోదించింది. దీని వల్ల బ్యాంక్ బుక్స్ చాలా వరకు క్లీన్ అవుతాయి, మెట్రిక్స్ మెరుగు పడతాయి.
ఇండియన్ హోటల్స్ కంపెనీ (IHCL): టాటా గ్రూప్‌నకు చెందిన ఈ హాస్పిటాలిటీ ఫర్మ్, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో, సెలెక్షన్స్ (SeleQtions) బ్రాండ్ కింద రెండో హోటల్‌ను ఏర్పాటు చేస్తోంది, ఇందుకోసం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం సోహమ్ హోటల్స్ & రిసార్ట్స్ నిర్వహణలో ఉన్న ఫ్రాంఛైజీ హోటల్‌ను IHCL SeleQtionsగా రీ బ్రాండ్ చేస్తారు.
జైడస్ లైఫ్‌సైన్సెస్: క్యాన్సర్ నిరోధక ఔషధం లెనాలిడోమైడ్ (Lenalidomide) క్యాప్సూల్స్‌ను అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఈ డ్రగ్ మేకర్ తెలిపింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ జెనరిక్ ఉత్పత్తిని ప్రారంభించింది.
ఐటీఐ: రాష్ట్రపతికి ఈక్విటీ షేర్ల కేటాయింపును పరిశీలించేందుకు, ఈ ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 28న సమావేశమవుతుంది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కింద ఈ కంపెనీకి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.
స్పైస్‌జెట్: కష్టాల్లో ఉన్న ఈ ఏవియేషన్ కంపెనీ, తన 80 మంది పైలట్లను జీతం లేని మూడు నెలల సెలవుపై పంపుతోంది. ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్‌బీసీసీ (ఇండియా): ఆగస్టులో రూ.274.77 కోట్ల వ్యాపారాన్ని దక్కించుకున్నట్లు ఈ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్: పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా విజయదురైని నియమించడం కోసం ఈ ప్రైవేట్ లెండర్ చేసిన సిఫార్సును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విజయదురై నియామకం కోసం గత నెల 20న ఆర్‌బీఐకి బ్యాంక్ సిఫార్సు చేసింది. ఈ బ్యాంక్ ఇటీవలే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన