Stocks to watch today, 16 September 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 99 పాయింట్లు లేదా 0.5 శాతం రెడ్‌ కలర్‌లో 17,780 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


యూపీఎల్ (UPL): పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ క్లీన్ మ్యాక్స్ క్రాటోస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (Clean Max Kratos Pvt Ltd) 26 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఈ ఆగ్రో కెమికల్ కంపెనీ ప్రకటించింది. క్లీన్ మాక్స్‌ను, ఈ ఏడాది జులై 28న, రూ.1 లక్ష పెయిడప్‌ క్యాపిటల్‌తో ప్రారంభించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ఈ కంపెనీ, ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు.


అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్‌: బంగాల్‌లోని హల్దియా డాక్ సామర్థ్యాన్ని అదానీ పోర్ట్స్ మరింత పెంచుతోంది. అదానీ పోర్ట్స్ అనుబంధ అయిన హెచ్‌డీసీ బల్క్ టెర్మినల్ (HDC Bulk Terminal), హల్దియా పోర్ట్‌లోని రెండో నంబర్ బెర్త్ యాంత్రికీకరణ కోసం కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌తో (Syama Prasad Mookerjee Port) ఒప్పందంపై సంతకం చేసింది.


ఇండస్‌ఇండ్ బ్యాంక్: మరో మూడేళ్ల పాటు బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టరేట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) సుమంత్ కథ్‌పాలియాను కొనసాగిస్తూ ఈ ప్రైవేట్ రంగ రుణదాత డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయం ఆర్‌బీఐ అనుమతికి లోబడి ఉంటుంది.
పీవీఆర్‌ (PVR): మూడు వేర్వేరు కంపెనీలు, పీవీఆర్‌కు చెందిన రూ.759.14 కోట్ల విలువైన 40.45 లక్షల షేర్లను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశాయి. ప్లెంటీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 10,76,259 షేర్లను సగటున రూ. 1,887.04 ధర వద్ద; గ్రే బిర్చ్ ఇన్వెస్ట్‌మెంట్ 22,06,743 షేర్లను సగటున రూ. 1,871.18 చొప్పున విక్రయించాయి.


ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్: ఈ క్రెడిట్ కార్డ్ సంస్థ, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ.500 కోట్లు సేకరించింది. 5,000 బాండ్లను ఫిక్స్‌డ్‌ రేట్‌, అన్‌ సెక్యూర్డ్‌, టాక్సబుల్‌, రిడీమబుల్‌ పద్ధతిలో, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో జారీ చేసింది. ఒక్కో దాని విలువ రూ.10 లక్షలు. బాండ్ల కాలపరిమితి మూడు సంవత్సరాలు. 2025 సెప్టెంబర్ 15న కాల పరిమితి ముగుస్తుంది.


ఇండియన్ హోటల్స్ కంపెనీ: టాటా గ్రూప్‌లోని ఈ హోటల్ ఆపరేటర్, ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని 129 గదుల వివంత హోటల్‌ కోసం మార్వెలస్ ఇన్‌ఫ్రాస్టేట్‌తో (Marvelous Infraestate) నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోటల్‌లో మార్పులు చేసిన తర్వాత వివంత పేరిట రీ బ్రాండ్ చేస్తారు.


టాటా మెటాలిక్స్: ఖరగ్‌పూర్‌లోని డక్‌టైల్‌ ఐరన్ పైపుల ప్లాంట్‌లోని రూ.600 కోట్లతో విస్తరణ పనులను టాటా మెటాలిక్స్ ప్రారంభించింది. ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న జల మౌలిక సదుపాయాల స్పేస్‌లో తన ఉనికిని విస్తరించడానికి టాటా మెటాలిక్స్‌కు ఈ కొత్త ఫ్లాంటు సహాయపడుతుంది.


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB): 22.6 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా రూ.475 కోట్లను సమీకరించిన ఈ ప్రైవేట్ బ్యాంక్‌, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌ను క్లోజ్‌ చేసింది. మొత్తం 22,61,90,476 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ. 21 ఇష్యూ ధరకు SFB జారీ చేసింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.