Stock Market Closing 15 September 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం భయాలు, ఆర్థిక మందగమనం డేటా మదుపర్లను కలవరపెట్టింది. ఐటీ షేర్లు విలవిల్లాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 116 పాయింట్ల నష్టంతో 17,887 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 412 పాయింట్ల నష్టంతో 59,934 వద్ద ముగిశాయి. రూపాయి 26 పైసలు నష్టపోయి 79.70 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,346 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,454 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 59,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,676 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 412 పాయింట్ల నష్టంతో 59,934 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 18,003 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,046 వద్ద ఓపెనైంది. 17,862 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 116 పాయింట్ల నష్టంతో 17,887 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,533 వద్ద మొదలైంది. 41,154 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,840 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్ల నష్టంతో 41,228 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. మారుతీ, ఐచర్ మోటార్స్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ , పవర్‌గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, సిప్లా, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టపోయాయి. ఆటో, మెటల్ మినహా మిగతా రంగాల సూచీలన్నీ పతనం అయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.