Stocks to watch today, 14 September 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 298 పాయింట్లు లేదా 1.65 శాతం రెడ్‌‌లో 17,794 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC): ఈ కంపెనీకి 'డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్' (DFI) హోదాను మంజూరు చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. గ్లోబల్ క్లైమేట్ ఫండింగ్, దేశంలో నికర శూన్య పెట్టుబడిని (net zero investment) ముందుకు తీసుకెళ్లేందుకు PFCని సిద్ధం చేయడం ఈ చర్య వెనుక ఉన్న లక్ష్యం.


జేఎస్‌డబ్ల్యూ స్టీల్: ఈ కంపెనీ ప్లాంట్లను డీకార్బనైజేషన్ ప్రాజెక్టులుగా మార్చడానికి జర్మన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ SMS గ్రూప్‌తో మంగళవారం అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేయడానికి ఉన్న అవకాశాలను ఈ ఒప్పందం ద్వారా పరిశీలించి, అమలు చేస్తారు.


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC): పేమెంట్‌ అగ్రిగేటర్‌గా వ్యవహరించడానికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి IRCTC ఆమోదం పొందింది.


PVR/ Inox: ప్రతిపాదిత PVR - Inox ఒప్పందానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) తిరస్కరించింది. ఈ ఒప్పందం, ఫిల్మ్ ఎగ్జిబిషన్ పరిశ్రమపై 'యాంటీ కాంపిటీషన్‌' ప్రభావాన్ని చూపుతుందని ఆరోపిస్తూ కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ (CUTS) ఫిర్యాదు చేసింది.


అంబుజా సిమెంట్స్: నిధుల సమీకరణను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 16న సమావేశమవుతుంది.


భారత్ ఫోర్జ్: కమర్షియల్ ట్రక్‌ల కోసం 'ఎలక్ట్రిఫైడ్ డ్రైవ్‌ట్రెయిన్'లను అభివృద్ధి చేసేందుకు ఈ కంపెనీ అనుబంధ సంస్థ 'కళ్యాణి పవర్‌ట్రెయిన్', కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ 'హర్బింగర్ మోటార్స్ ఇంక్' జాయింట్ వెంచర్‌ ప్రకటించాయి. కొత్త JVని ElectroForge అని పిలుస్తారు. 


ఇన్ఫోసిస్: యూరప్‌లో ప్రముఖ పోస్టల్ ఆపరేటర్ & ఓమ్ని కామర్స్ లాజిస్టిక్స్ పార్టనర్‌ అయిన భాగస్వామి Bpost (Belgium Post) కంపెనీతో, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌తో కలిసి, ఇన్ఫోసిస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్ వాతావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి, Bpost మెయిల్ డెలివరీ, లాజిస్టిక్స్ సేవల కోసం బలమైన సైబర్ రెసిలెన్స్‌ను రూపొందించడం ఈ ఒప్పందం ఉద్దేశం.


కేఈసీ ఇంటర్నేషనల్: ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్, రైల్వేలు సహా వివిధ వ్యాపారాల కోసం ఈ కంపెనీ రూ.1108 కోట్ల కొత్త ఆర్డర్‌లను దక్కించుకుంది.


బజాజ్ హోల్డింగ్స్ & ఇన్వెస్ట్‌మెంట్: 2023 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.110 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ పొందేందుకు సభ్యుల అర్హతను నిర్ణయించే రికార్డు తేదీగా ఈ నెల 23ను నిర్ణయించింది. 


న్యూలాండ్ లేబొరేటరీస్: కెరీర్ అవకాశాల అన్వేషణ కోసం కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి దీపక్ గుప్తా రాజీనామా చేశారు. అక్టోబరు 13 వరకు ఆయన ఈ పాత్రలో కొనసాగనున్నారు.


ఫిలాటెక్స్ ఇండియా: జూన్ 2, 2021 నుంచి అమలులోకి వచ్చేలా, 20 సంవత్సరాల పాటు పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ఈ కంపెనీ పేటెంట్‌ పొందింది.


ఛాయిస్ ఇంటర్నేషనల్: 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్ల కేటాయింపు కోసం అర్హులైన వారిని పేర్లను ఖరారు చేయడానికి ఈ నెల 23ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.


ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్: అంబుజా సిమెంట్స్, డెల్టా కార్ప్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.