Stock Market Opening 01 November 2022: నవంబర్ నెల ఆరంభం అదిరింది. భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 139 పాయింట్ల లాభంతో 18,151 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 444 పాయింట్ల లాభంతో 61,191 వద్ద కొనసాగుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,746 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,065 వద్ద మొదలైంది. 60,998 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,242 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 444 పాయింట్ల లాభంతో 61,191 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 18,012 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,151 వద్ద ఓపెనైంది. 18,084 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,164 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 139 పాయింట్ల లాభంతో 18,151 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 41,552 వద్ద మొదలైంది. 41,393 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,677 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 270 పాయింట్ల లాభంతో 41,577 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌టీ, యూపీఎల్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు 0.50-1.50 శాతం మేర లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.