Stock Market Closing 28 October 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరుగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందనప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆటో, ఆయిల్ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్ల లాభంతో 17,786 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 203 పాయింట్ల లాభంతో 59,959 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు లాభపడి 82.47 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,756 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,742 వద్ద మొదలైంది. 59,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,133 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 203 పాయింట్ల లాభంతో 59,959 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,736 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,756 వద్ద ఓపెనైంది. 17,723 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,838 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 49 పాయింట్ల లాభంతో 17,786 వద్ద స్థిరపడింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,236 వద్ద మొదలైంది. 40,839 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,482 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 308 పాయింట్ల నష్టంతో 40,990 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్‌టీపీసీ, హీరోమోటో కార్ప్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టాటా స్టీల్, సన్ ఫార్మా, గ్రాసిమ్, దివిస్ ల్యాబ్ నష్టపోయాయి. ఆటో, ఆయిల్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.