Stock Market Closing 27 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందనప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బ్యాంకింగ్‌ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్ల నష్టంతో 17,736 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 212 పాయింట్ల నష్టంతో 59,756 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు లాభపడి 82.49 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,543 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,792 వద్ద లాభాల్లో మొదలైంది. 59,496 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,959 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా  212 పాయింట్ల లాభంతో 59,756 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 17,656 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,771 వద్ద ఓపెనైంది. 17,654 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,789 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 80 పాయింట్ల లాభంతో 17,736 వద్ద స్థిరపడింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 41,440 వద్ద మొదలైంది. 41,178 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,511 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 176 పాయింట్ల లాభంతో 41,299 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.