Stock Market Closing Bell 28 July 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంచినా మదుపర్లు భయపడటం లేదు. ఆర్థిక మాంద్యం భయాలను ఫెడ్ ఛైర్‌పర్సన్ కొట్టిపడేయడం వారిలో విశ్వాసం నింపింది. ఎఫ్ఐఐలు తిరిగి పెట్టుబడులు పెడుతుండటంతో కొనుగోళ్లు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 287 పాయింట్ల లాభంతో 16,929 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1041 పాయింట్ల లాభంతో 56,857 వద్ద ముగిశాయి. నేడు ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,816 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,267 వద్ద మొదలైంది. 56,236 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1041 పాయింట్ల లాభంతో 56,857 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,641 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,774 వద్ద ఓపెనైంది. 16,746 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,947 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 287 పాయింట్ల లాభంతో 16,929 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,102 వద్ద మొదలైంది. 37,028 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,414 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 594 పాయింట్ల లాభంతో 37,378 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ లాభాల్లో ముగిశాయి. శ్రీ సెమ్, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సెమ్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్షియల్, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు 1-2 శాతం వరకు ఎగిశాయి.