Stock Market Opening Bell 28 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కమొడిటీస్‌ ధరల తగ్గుదల, ఫెడ్‌ వడ్డీరేట్ల భయం తొలగిపోవడం, ఎఫ్ఐఐలు తిరిగి పెట్టుబడులు పెడుతుండటంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 198 పాయింట్ల లాభంతో 16,840 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 723 పాయింట్ల లాభంతో 56,540 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 55,816 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,267 వద్ద మొదలైంది. 56,236 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,610 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 723 పాయింట్ల లాభంతో 56,540 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 16,641 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,774 వద్ద ఓపెనైంది. 16,746 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,856 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 198 పాయింట్ల లాభంతో 16,840 వద్ద ట్రేడవుతోంది.



Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 37,102 వద్ద మొదలైంది. 37,028 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 481 పాయింట్ల లాభంతో 37,265 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్షియల్‌, ఐటీ, రియాల్టీ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువగా లాభాల్లో ఉన్నాయి.