Stock Market @ 12 PM 1 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం మోస్తరు నష్టాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఉదయం ముడిచమురు ధరలపై ఎగుమతి పన్ను విధించడంతో సూచీలు భారీ ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 28 పాయింట్ల నష్టంతో 15,752, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గత ముగింపు 78.97తో పోలిస్తే నేడు 79.04 వద్ద క్లోజైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 53,018 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,863 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,053 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1000 పాయింట్ల వరకు పడ్డ సూచీ ఆ తర్వాత కోలుకోవడం గమనార్హం.


NSE Nifty


గురువారం 15,780 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,703 వద్ద ఓపెనైంది. 15,511 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో సూచీ దాదాపుగా 200 పాయింట్లు పతనమైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో మొదలై లాభాల్లో ముగిసింది. ఉదయం 33,264 వద్ద మొదలైంది. 33,080 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,666 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్ల లాభంతో 33,539 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, సిప్లా, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి. ఎగుమతి పన్ను పెంచడంతో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీల షేర్లు ఢమాల్‌ అన్నాయి. సంబంధిత సూచీ 4 శాతానికి పైగా పతనమైంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.