Stock Market Closing Bell 5 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు ఉదయం భారీగా లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు తెరవగానే ఢమాల్‌ అని పడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్ల నష్టంతో 15,798, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద క్లోజ్‌ అయ్యాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 53,234 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,501 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. 53,234 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 650 పాయింట్ల మేర రాణించిన సూచీ ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక ఢమాల్‌ అనేసింది! 


NSE Nifty


సోమవారం 15,835  వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,909 వద్ద ఓపెనైంది. 15,835 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,025 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 36 పాయింట్ల నష్టంతో 15,798 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లోంచి నష్టాల్లో ముగిసింది. ఉదయం 34,084 వద్ద మొదలైంది. 33,757 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,361 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 125 పాయింట్ల నష్టంతో 33,815 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. శ్రీసెమ్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ, విప్రో, మారుతీ, బ్రిటానియా నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా, మెటల్‌ రంగాల సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు పతనమయ్యాయి.