Stock Market @ 12 PM 5 July 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బెంచ్‌మార్క్ సూచీలు మెరుగ్గా ట్రేడువుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల లాభంతో 16,020, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 615 పాయింట్ల లాభంతో 53,955 వద్ద ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,234 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,501 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. 53,437 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 615 పాయింట్ల లాభంతో 53,955 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 15,835 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,909 వద్ద ఓపెనైంది. 15,899 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,025 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 187 పాయింట్ల లాభంతో 16,020 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 34,084 వద్ద మొదలైంది. 34,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34355 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్న 399 పాయింట్ల లాభంతో 34,339 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్సీ లైఫ్, మారుతి, హీరోమోటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, రియాల్టీ, మెటల్, బ్యాంక్ సూచీలు 1-2 శాతానికి పైగా ఎగిశాయి.