By: ABP Desam | Updated at : 24 Aug 2022 04:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell 24 August 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్ భయాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 27 పాయింట్ల లాభంతో 17,604 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 54 పాయింట్ల లాభంతో 59,085 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు లాభపడి 79.81 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,031 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,853 వద్ద మొదలైంది. 58,760 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,170 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 54 పాయింట్ల లాభంతో 59,085 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,577 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,525 వద్ద ఓపెనైంది. 17,499 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 27 పాయింట్ల లాభంతో 17,604 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 38,552 వద్ద మొదలైంది. 38,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 340 పాయింట్ల లాభంతో 39,038 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. దివిస్ ల్యాబ్, బీపీసీఎల్, టాటా స్టీల్, టీసీఎస్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా