search
×

Stock Market Today: ఆద్యంతం ఒడుదొడుకులే! లాభాల్లోంచి నష్టాలకు మళ్లిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell on 14 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్ల నష్టంతో 15,732, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell on 14 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు బేర్స్‌ గ్రిప్‌లోకి వెళ్లడంతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలేమీ కనిపించడం లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్ల నష్టంతో 15,732, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 52,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,495 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 52,459 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఓపెనింగ్‌లో 300 పాయింట్ల నష్టపోయిన సూచి ఆ తర్వాత పుంజుకొని 100 పాయింట్లు లాభపడింది. ఆఖర్లో మళ్లీ పతనమై 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిసింది. 

NSE Nifty

సోమవారం 15,774 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,674 వద్ద ఓపెనైంది. 15,659 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,858 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 42 పాయింట్ల నష్టంతో 15,732 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,180 వద్ద మొదలైంది. 33,123 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,618 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 94 పాయింట్ల నష్టంతో 33,311 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎం అండ్‌ ఎం, సిప్లా షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, ఇండస్‌ ఇండ్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. పవర్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఫార్మా, మెటల్‌, ఐటీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. 

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 14 Jun 2022 04:01 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్

Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?

Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?

Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?