Stock Market Closing Bell 26 August 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఉదయం కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు ఆఖర్లో లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 23 పాయింట్ల లాభంతో 17,545 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 59 పాయింట్ల లాభంతో 58,833 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా లాభపడి 79.87 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,774 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,050 వద్ద మొదలైంది. 58,722 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,321 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 59 పాయింట్ల లాభంతో 58,833 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,592 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,619 వద్ద ఓపెనైంది. 17,519 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 23 పాయింట్ల లాభంతో 17,545 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,129 వద్ద మొదలైంది. 38,846 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,337 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 10 పాయింట్ల నష్టపోయి 38,940 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ముగిశాయి. గ్రాసిమ్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, అదానీ పవర్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఆటో, ఐటీ, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.