Stock Market Opening Bell 26 August 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 69 పాయింట్ల లాభంతో 17,592 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 203 పాయింట్ల లాభంతో 58,993 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 58,774 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,050 వద్ద మొదలైంది. 58,966 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,321 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 203 పాయింట్ల లాభంతో 58,993 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,592 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,619 వద్ద ఓపెనైంది. 17,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 69 పాయింట్ల లాభంతో 17,592 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 39,129 వద్ద మొదలైంది. 39,022 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,337 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 103 పాయింట్ల లాభంతో 39,054 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ ఒక శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.