Stock Market Closing Bell 25 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినా అమెరికా, ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే సూచీలు పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్ల నష్టంతో 17,522 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 310 పాయింట్ల నష్టంతో 58,774 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు తగ్గి 79.88 వద్ద స్థిరపడింది. 


BSE Sensex


క్రితం సెషన్లో 59,085 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,315 వద్ద మొదలైంది. 58,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 300  పాయింట్ల  మేర లాభపడ్డ సూచీ చివరికి 310 పాయింట్ల నష్టంతో 58,774 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 17,604 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,679 వద్ద ఓపెనైంది. 17,487 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,726 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 82 పాయింట్ల నష్టంతో 17,522 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,190 వద్ద మొదలైంది. 38,803 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,417 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 87 పాయింట్ల నష్టంతో 38,950 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. శ్రీసెమ్‌, హిందాల్కో, దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టపోయాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు మినహా మిగతావన్నీ ఎరుపెక్కాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.