search
×

Stock Market Closing: సాయంత్రానికి ఉల్టా పల్టా! సగానికి తగ్గిన సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు!

Stock Market Closing Bell 09 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు ఆఖర్లో లాభాల స్వీకరణకు దిగారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 09 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ కొనుగోళ్లు చేపట్టిన మదుపర్లు ఆఖర్లో లాభాల స్వీకరణకు దిగారు. దాంతో ఆరంభం లాభాలు కాస్త తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 34 పాయింట్ల లాభంతో 17,833 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 104 పాయింట్ల లాభంతో 59,793 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలపడి 79.57 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,688 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,045 వద్ద లాభాల్లో మొదలైంది. 59,634 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,119 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 104 పాయింట్ల లాభంతో 59,793 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 17,798 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,923 వద్ద ఓపెనైంది. 17,786 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 34 పాయింట్ల లాభంతో 17,833 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 40,520 వద్ద మొదలైంది. 40,280 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,685 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 206 పాయింట్ల లాభంతో 40,415 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, ఇన్‌పీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎంఎ అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌, రియాల్టీ, ఫార్మా, మీడియా, ఫైనాన్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Published at : 09 Sep 2022 03:46 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !

Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  

Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  

BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం

BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం