Stock Market Opening Bell 24 August 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ఓపెనయ్యాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్ల లాభంతో 17,608 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 93 పాయింట్ల లాభంతో 59,124 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,031 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,853 వద్ద మొదలైంది. 58,760 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,145 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 93 పాయింట్ల లాభంతో 59,124 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 17,577 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,525 వద్ద ఓపెనైంది. 17,499 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,614 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 31 పాయింట్ల లాభంతో 17,608 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 38,552 వద్ద మొదలైంది. 38,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 205 పాయింట్ల లాభంతో 38,902 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, బీపీసీఎల్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, టైటాన్ నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా మిగతా రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, మీడియా, మెటల్, రియాల్టీ సూచీ 0.50 శాతం కన్నా ఎక్కువగా పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.