Stock Market Closing Bell 23 August 2022: రెండు రోజుల భారీ నష్టాలకు తెర పడింది! భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత నిలదొక్కుకున్నాయి. ఐరోపా, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల అంశాలు కలవరపెట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్ల లాభంతో 17,577 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 257 పాయింట్ల లాభంతో 59,031 వద్ద ముగిశాయి. డాలర్‌త పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీన పడి 79.91 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,789 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,205 వద్ద మొదలైంది. 58,172 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,199 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 257 పాయింట్ల లాభంతో 59,031 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,490 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,357 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 86 పాయింట్ల లాభంతో 17,577 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,955 వద్ద మొదలైంది. 37,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,869 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 399 పాయింట్ల లాభంతో 38,697 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టీసీఎస్, దివిస్ ల్యాబ్, హిందుస్థాన్ యునీలివర్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. ఐటీ మినహా మిగతా సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఆటో, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక శాతాన్ని మించి లాభాల్లో ముగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.