By: ABP Desam | Updated at : 18 Oct 2022 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్‌డేట్, ( Image Source : Twitter )
Stock Market Closing 18 October 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సూచనలు అందాయి. కార్పొరేట్, రిటైల్ రుణాల వృద్ధితో బ్యాంకు షేర్లకు గిరాకీ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 175 పాయింట్ల లాభంతో 17,486 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 549 పాయింట్ల లాభంతో 58,960 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి 82.36 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,744 వద్ద లాభాల్లో మొదలైంది. 58,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,143 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 549 పాయింట్ల లాభంతో 58,960 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,311 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,438 వద్ద ఓపెనైంది. 17,434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,527 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 175 పాయింట్ల లాభంతో 17,486 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 40,252 వద్ద మొదలైంది. 40,139 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,435 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 398 పాయింట్ల లాభంతో 40,318 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, బ్రిటానియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Godavari Graduates MLC Winner: గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
Lokesh on Talliki Vandanam: తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
Sandeep Reddy Vanga: 'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
Telangana LRS Scheme: ఆ ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరణకు ఛాన్స్, LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్