Stock Market Closing Bell 19 August 2022: ఎనిమిది రోజుల వరుస లాభాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందకపోవడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 198 పాయింట్ల నష్టంతో 17,758 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 651 పాయింట్ల లాభంతో 59,646 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు నష్టపోయి 79.78 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,298 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,351 వద్ద మొదలైంది. 59,474 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,411 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 651 పాయింట్ల నష్టంతో 59,646 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,956 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,966 వద్ద ఓపెనైంది. 17,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 198 పాయింట్ల నష్టంతో 17,758 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,732 వద్ద మొదలైంది. 38,848 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,759 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 670 పాయింట్ల నష్టంతో 38,985 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎల్‌టీ, ఇన్ఫీ, బజాజ్ ఆటో, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కన్జూమర్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్, మెటల్, ఫార్మా, రియాల్టీ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.