Stock Market Opening Bell 19 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోవడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలూ అందలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్ల లాభంతో 17,958 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 5 పాయింట్ల లాభంతో 60,300 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లకు గిరాకీ ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,298 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,351 వద్ద మొదలైంది. 60,245 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,351 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 5 పాయింట్ల లాభంతో 60,300 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 17,956 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,966 వద్ద ఓపెనైంది. 17,933 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్ల లాభంతో 17,958 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 39,732 వద్ద మొదలైంది. 39,486 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,759 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 127 పాయింట్ల నష్టంతో 39,528 వద్ద కదలాడుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీ, ఇన్ఫీ, కొటక్‌ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అపోలో హాప్పిటల్స్‌, కోల్‌ ఇండియా, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, మీడియా సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.