Stock Market Closing Bell 18 August 2022: భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్ల లాభంతో 17,956 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 60,298 వద్ద ముగిశాయి. ఐటీ, హెల్త్‌కేర్, మెటల్ రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు నష్టపోయి 79.69 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,260 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,080 వద్ద మొదలైంది. 59,946 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,341 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 37 పాయింట్ల లాభంతో 60,298 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,898 వద్ద ఓపెనైంది. 17,852 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,968 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 12 పాయింట్ల లాభంతో 17,956 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 39,324 వద్ద మొదలైంది. 39,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,703 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 194 పాయింట్ల లాభంతో 39,656 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. కొటక్ బ్యాంక్, ఎల్‌టీ, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సెమ్, ఇండస్‌ఇండ్ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, విప్రో, బీపీసీఎల్, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, మీడియా, ఐటీ, ఆటో సూచీలు పనతమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.