By: ABP Desam | Updated at : 26 Jul 2022 03:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing Bell 26 July 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా ఫెడ్ సమీక్ష, వడ్డీరేట్ల పెంపు వంటి ఈవెంట్లు ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 147 పాయింట్ల నష్టంతో 16,483 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.76గా ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,834 వద్ద లాభాల్లో మొదలైంది. 55,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,834 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 16,631 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,632 వద్ద ఓపెనైంది. 16,463 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 147 పాయింట్ల నష్టంతో 16,483 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లోనే ముగిసింది. ఉదయం 36,688 వద్ద మొదలైంది. 36,334 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 317 పాయింట్ల నష్టంతో 36,408 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హిందుస్థాన్ యునీలివర్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. మీడియా తప్ప మిగతా రంగాల సూచీలన్నీ నేల చూపులు చూశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తీవ్ర నష్టాల్ని చవిచూశాయి.
Stock Market Opening: నో మూమెంటమ్! 60K తర్వాత సెన్సెక్స్ ఏంటని మదుపరి సందేహం?
Stock Market Closing: సెన్సెక్స్ 60k టచ్ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!
Top Loser Today August 16, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 16, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Stock Market Opening: యురేకా! ఏడాది తర్వాత 60,000ని తాకిన సెన్సెక్స్! భారీ లాభాల్లో మార్కెట్లు
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Dhamaka Movie: దుమ్మురేపుతున్న మాస్ మహారాజా ఊరమాస్ సాంగ్ 'జింతాక్'
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!