Stock Market Closing Bell 29 July 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఆర్థిక మాంద్యం భయాలు పోవడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 228 పాయింట్ల లాభంతో 17,158 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 712 పాయింట్ల లాభంతో 57,570 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 49 పైసలు లాభపడి 79.26 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 56,857 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,258 వద్ద మొదలైంది. 57,104 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,619 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 57,570 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 16,929 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,079 వద్ద ఓపెనైంది. 17,018 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 228 పాయింట్ల లాభంతో 17,158 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 37,713 వద్ద మొదలైంది. 37,221 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,754 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 113 పాయింట్ల లాభంతో 37,491 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ లైఫ్, టాటా స్టీల్, హిందాల్కో, సన్‌ఫార్మా, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ, కొటక్ బ్యాంక్, దివిస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.